Plane Crash : క్షణాల్లో జరిగిన ప్రమాదం కావడంతో ఆ సంకేతం కాపాడ లేకపోయిందా?
అహ్మదాబాద్ లో జరిగిన విమాన ప్రమాదం తీవ్ర విషాదం మిగిల్చింది.పైలెట్ నుంచి ఏటీసీకి మేడే అని సందేశం వచ్చింది
అహ్మదాబాద్ లో జరిగిన విమాన ప్రమాదం తీవ్ర విషాదం మిగిల్చింది. అయితే ఎయిర్ ఇండియా విమానం టేకాఫ్ అయిన వెంటనే విమానం పైలెట్ నుంచి ఏటీసీకి మేడే అని సందేశం వచ్చింది. తర్వాత ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ నుంచి తర్వాత రెస్పాన్స్ కట్ అయింది. అయితే ఈ మేడే అనే పదం చాలా డేంజర్ లో ఉన్నప్పుడు మాత్రమే ఈ రకమైన సందేశం వస్తుంది. ఈ సందేశం వస్తే విమానం తీవ్రమైన ప్రమాదంలో ఉన్నట్లు గుర్తించాలి. అదే సమయంలో ప్రయాణికుల ప్రాణాలకు కూడా ముప్పు ఏర్పడిందని అర్థం. ఈ పదం అంతర్జాతీయంగా చాలా తక్కువ సార్లు మాత్రమే వినపడుతుందని చెబుతున్నారు. కానీ అహ్మదాబాద్ విమానం నుంచి ఈ మేడే అనే సంకేతం విని ఏటీసీలో కూడా పెను ప్రమాదం జరిగినట్లు గుర్తించారు.
పెను ప్రమాదం సంభవించినప్పుడు...
విమానంలో సాంకేతిక లోపం వచ్చినప్పుడు కానీ, ప్రయాణికుల ప్రాణాలు ప్రమాదంలో పడినప్పుడు కానీ వచ్చే ఈ మేడే సందేశం రావడంతో పెను విషాదమే జరుగుతుందని భావించారు. అయితే తర్వాత కాక్ పిట్ నుంచి ఎలాంటి రెస్పాన్స్ రాకపోవడంతో ఏటీసీ కూడా విమానంలో ఏదో జరగకూడనిదే జరిగిందన్న నిర్ధారణకు వచ్చారు. మేడే అంటే సాయం చేయండి అని అర్థమట. ఈ పదం అత్యవసర సమయాల్లోనే వినియోగిస్తారు. ప్రమాదం తీవ్రత ఎక్కువగా ఉన్నప్పుడు మాత్రమే మేడే అని అరుస్తారు. అది స్పష్టంగా ఏటీసీకి వినపడే సంకేతం. మరే పదమైనా వినియోగిస్తే సరిగా అర్థం కాక, వినపడక అయోమయానికి గురై అత్యవసర సాయం అందించే వీలుండదని సులువుగా గుర్తించేందుకు 1920 వ సంవత్సరంలో లండన్ లోని క్రోయడన్ విమానాశ్రయంలో దీనిని ఉపయోగించారు.
అప్రమత్తమయి వెంటనే...
మేడే సంకేతం వచ్చిన వెంటనే ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ రూంలో ఉన్న సిబ్బంది అప్రమత్తమవుతారు. తీవ్ర ప్రమాదంలో ఉన్నారని గుర్తించి వెంటనే అంబులెన్స్ లతో పాటు వివిధ సహాయక బృందాలను కూడా సిద్ధం చేయడానికి మే డే పదాన్నిఉపయోగిస్తారు. వెంటనే ఇతర విమానాలను కూడా అలెర్ట్ చేస్తారు. అటు వైపు వెళ్లవద్దని కూడా చెబుతారు. ఇలాంటి సందేశమే నిన్న ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ రూంకు రావడంతో వెంటనే ప్రమాదంలో ఉందని భావించి హై అలెర్ట్ చేశారు. అంబులెన్స్ లు రప్పించారు. అంతా క్షణాల్లో జరిగిపోయింది. ఈ సందేశం కారణంగానే వెంటనే సహాయక చర్యలు ప్రారంభించినట్లు ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ రూం అధికారుు తెలపారు. ఈ పదం కేవలం అత్యవసర సమయాల్లోనే ఉపయోగిస్తారు కనుక...ఆ సంకేతాన్ని అనుభవమున్న పైలెట్ ఉపయోగించి ఉంటారంటున్నారు.