విమాన ప్రమాదం.. 1000 కోట్ల ఇన్సూరెన్స్ కట్టాలి

అహ్మదాబాద్‌లో ఎయిర్ ఇండియా బోయింగ్ 787 డ్రీమ్‌లైనర్ విమానం కూలిపోయింది.

Update: 2025-06-13 10:00 GMT

అహ్మదాబాద్‌లో ఎయిర్ ఇండియా బోయింగ్ 787 డ్రీమ్‌లైనర్ విమానం కూలిపోయింది. ఇది భారతదేశంలో అత్యంత ఖరీదైన విమానయాన బీమా క్లెయిమ్ గా మారింది. 1000 కోట్ల రూపాయల ఇన్సూరెన్స్ క్లెయిమ్ అయ్యే అవకాశం ఉంది. ఇది దేశ విమానయాన రంగం మొత్తం వార్షిక ప్రీమియం కంటే ఎక్కువ. 240 మందికి పైగా మరణించడం, విమానాశ్రయం సమీపంలో కలిగిన నష్టానికి భారీ ఇన్సూరెన్స్ చెల్లింపులకు దారితీస్తుందని భావిస్తున్నారు.

విమాన ప్రమాద మృతుల కుటుంబాలకు టాటా గ్రూప్‌ ఎక్స్‌గ్రేషియా ప్రకటించింది. ఒక్కొక్కరికి కోటి రూపాయల చొప్పున ఎక్స్‌గ్రేషియా చెల్లిస్తామని వెల్లడించింది. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న క్షతగాత్రుల వైద్య ఖర్చులన్నీ భరిస్తామని టాటా గ్రూప్‌ సంస్థ స్పష్టం చేసింది. బీజే మెడికల్‌ కాలేజ్‌ హాస్టల్‌ భవనాన్ని పునర్నిర్మిస్తామని హామీ ఇచ్చింది.

Tags:    

Similar News