Breaking : గూగుల్ మ్యాప్ ప్రాణాల మీదకు తెచ్చింది.
రాజస్థాన్ లో గూగుల్ మ్యాప్ తో వెళుతున్న వారు నదిలో గల్లంతయ్యారు. రాజస్థాన్ కు వెళుతున్న వ్యాన్ నదిలో కొట్టుకుపోయింది
రాజస్థాన్ లో గూగుల్ మ్యాప్ తో వెళుతున్న వారు నదిలో గల్లంతయ్యారు. రాజస్థాన్ కు వెళుతున్న వ్యాన్ బనాస్ నదిలో కొట్టుకుపోయింది. గూగుల్ మ్యాప్ సాయంతో వెళుతుండగా అది చూపించిన వైపు వెళుతుండగా మూసి ఉన్న కల్వర్లు పైకి వెళ్లడంతో ఒక్కసారిగా వ్యాన్ నదిలోకి పడిపోయింది. దీంతో వ్యాన్ నదిలో కొట్టుకుపోయింది. భారీ వర్షాలతో ఉత్తరాది రాష్ట్రాల్లో నదులు ఉప్పొంగుతున్నాయి.
ఐదుగురిని రక్షించిన...
ఇది గమనించిన స్థానికులు వ్యాన్ లో ఉన్న వారిని ఐదుగురిని రక్షించగలిగారు. మరో నలుగురు గల్లంతయ్యారని చెబుతున్నారు. దీంతో గల్లంతయిన వారి కోసం సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. రాజస్థాన్ లో జరిగిన ఈ ఘటనతో ఆ ప్రాంతంతో పాటు నదుల వద్ద పోలీసులు భారీ బందోబస్తు ను ఏ్పాటు చేశారు. ప్రజలు అవసరమైతే తప్ప ప్రయాణాలు పెట్టుకోవద్దని అధికారులు సూచిస్తున్నారు.