నేడు ఉపరాష్ట్రపతి అభ్యర్థి ఖరారు

భారతీయ జనతా పార్టీ పార్లమెంటరీ బోర్డు సమావేశం నేడు జరగనుంది. ఉపరాష్ట్రపతి అభ్యర్థిని ఎంపిక చేయనునుంది.

Update: 2022-07-16 03:09 GMT

భారతీయ జనతా పార్టీ పార్లమెంటరీ బోర్డు సమావేశం నేడు జరగనుంది. ఉపరాష్ట్రపతి అభ్యర్థిని ఎంపిక చేయనునుంది. ఉపరాష్ట్రపతి ఎన్నికకు సమయం దగ్గర పడుతుండటంతో పార్లమెంటరీ బోర్డు నేడు సమావేశం కానుంది. అభ్యర్థి ఎంపికతో పాటు విపక్షాల మద్దతు కోరే అవకాశముంది. ఉపరాష్ట్రపతిని పార్లమెంటు సభ్యులు ఎన్నుకుంటారు. పార్లమెంటులో బీజేపీకి బలం ఉంది. అయినా విపక్షాల మద్దతును కోరి ఎన్నికను ఏకగ్రీవం చేయాలన్నది బీజేపీ ఆలోచనగా ఉంది.

ఉత్తర భారతానికి...
ఉపరాష్ట్రపతిగా ఉత్తర భారత దేశానికి చెందిన వారినే ఎంపిక చేయాలని నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం. అగ్రకులం లేదా మైనారిటీ వర్గాలకు అవకాశమిచ్చే అవకాశముందని సమాచారం. ఈ సమావేశానికి ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షాతోపాటు కీలక నేతలు అందరూ హాజరు కానున్నారు. ప్రస్తుత ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు పదవీ కాలం వచ్చే నెల 10వతేదీతో ముగియనుంది.


Tags:    

Similar News