నేడు నాలుగో రోజు పార్లమెంటు సమావేశాలు

పార్లమెంటు వర్షాకాల సమావేశాలు నేడు నాలుగో రోజు ప్రారంభం కానున్నాయి

Update: 2025-07-24 04:08 GMT

పార్లమెంటు వర్షాకాల సమావేశాలు నేడు నాలుగో రోజు ప్రారంభం కానున్నాయి. ఈ నెల 21వ తేదీన ప్రారంభమయిన సమావేశాలు విపక్షాల ఆందోళనలతో ఎటువంటి చర్చ జరగకుండానే వాయిదా పడుతూ వస్తున్నాయి. తాము ఇచ్చిన వాయిదా తీర్మానాలపై చర్చించాలని, ప్రశ్నోత్తరాలను, జీరో అవర్ ను వాయిదా వేసి చర్చ జరపాలని విపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి. దీంతో ఉభయ సభలు మూడు రోజులుగా వాయిదాలకే పరిమితమయ్యాయి.

మూడు రోజుల నుంచి...
ఈరోజు నాలుగో రోజు కూడా విపక్షాలు ఇచ్చిన వాయిదా తీర్మానాలపై చర్చించాలని పట్టుబట్టే అవకాశముంది. బీహార్ లో ఓటర్ల జాబితా సవరణపై చర్చించాలని, దానిని ఉపసంహరించుకోవాలని విపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి. స్పీకర్ పోడియాన్ని విపక్ష సభ్యులు చుట్టుముడుతుండటంతో సభలో గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. దీంతో సభలు వాయిదా పడుతున్నాయి.


Tags:    

Similar News