Big Breaking : విమాన ప్రమాదంలో అందరూ మరణించినా ఒకే ఒక్కరు బతికి బయటపడి
అహ్మదాబాద్ లో ఎయిర్ ఇండియా విమానం కుప్పకూలిన ఘటనలో ఒకరు ప్రాణాలతో బయటపడ్డారు. రమేష్ విశ్వాస్ కుమార్ ప్రాణాలతో బయటపడ్డారు
అహ్మదాబాద్ లో ఎయిర్ ఇండియా విమానం కుప్పకూలిన ఘటనలో ఒకరు ప్రాణాలతో బయటపడ్డారు. 11A సీటులో కూర్చున్న రమేష్ విశ్వాస్ కుమార్ ప్రాణాలతో బయటపడ్డారు. ఈ ప్రమాదంలో విమానంలో ప్రయాణిస్తున్న విమానయాన సిబ్బంది, ప్రయాణికులతో పాటు రమేష్ విశ్వాస్ కుమార్ ప్రయాణిస్తున్నారు. అయితే ప్రమాదం జరిగిన తర్వాత రమేష్ విశ్వాస్ కుమార్ అక్కడి నుంచిబయటకు నడుచుకుంటూ వచ్చారు. దీంతో రమేష్ విశ్వాస్ కుమార్ ఈ ప్రమాదం కేసులో కీలకంగా మారనున్నారు.
అందరూ మరణించినా...
ఇప్పటికే విమాన ప్రమాదంలో 242 మంది మరణించారని చెబుతున్నారు. అహ్మదాబాద్ పోలీస్ కమిషనర్ జ్ఞానేంద్ర సింగ్ ప్రకటించారు.కానీ రమేష్ విశ్వాస్ కుమార్ ప్రస్తుతం ఆసుపత్రిలో కోలుకుంటున్నారు. ఆయన కోలుకున్న తర్వాత విచారణ జరిపితే టేకాఫ్ అయిన తర్వాత ఏం జరిగింది? ప్రమాదానికి గల కారణాలను కూడా ఆయన నుంచి తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. తప్పించుకున్న రమేష్ విశ్వాస్ కుమార్ బతికి బయటకు రావడం మాత్రం ఆశ్చర్యం కలిగించే అంశమే. రమేష్ విశ్వాస్ కుమార్ గత ఇరవై ఏళ్లుగా బ్రిటన్ లో ఉంటున్నారని, తాను కుటుంబసభ్యులను కలుసుకునేందుకు వచ్చి తిరుగు ప్రయాణంలో లండన్ కు బయలుదేరారు.
మధ్య సీట్లో కూర్చున్న
విమానంలో మధ్య సీట్లో కూర్చున్న రమేష్ విశ్వాస్ కుమార్ స్వల్ప గాయాలతో బయటపడ్డారు. ప్రమాదం జరిగిన తీరు చూస్తే విమానంలో ప్రయాణిస్తున్న వారుఎవరూ బతుకుతారని అనుకోరు. కానీ రమేష్ విశ్వాస్ కుమార్ మాత్రం బయటపడటంతో అతని నుంచి పూర్తి వివరాలను సేకరించడానికి అవకాశం ఏర్పడింది. ఇది మిరాకిల్ అని చెప్పాలి. విమాన ప్రమాదం బయటపడి ప్రమాదం నుంచి ఒకే ఒక్కడు బతికాడు. రమేష్ విశ్వాస్ సోదరుడు ఈ ప్రమాదంలో మరణించడంతో ఆయన షాక్ లో ఉన్నాడు. ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న రమేష్ విశ్వాస్ కుమార్ కోలుకున్న తర్వాత విమానంలో జరిగిన విషయాలుబయటకు వెల్లడయ్యే ఛాన్స్ ఉంది.