Corona Virus : పెరుగుతున్న కోవిడ్ కేసులు.. ఇక అప్రమత్తంగా లేకపోతే అంతే

భారత్‌లో పెరుగుతున్న కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతున్నాయి. కరోనా మరణాలు కూడా పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తుంది.

Update: 2025-06-11 12:45 GMT

భారత్‌లో పెరుగుతున్న కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతున్నాయి. కరోనా మరణాలు కూడా పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తుంది. భారత్ లో ప్రస్తుతం కరోనా కేసులు ఏడువేలు దాటాయని కేంద్ర వైద్య ఆరోగ్య సంస్థ అధికారులు వెల్లడించారు. ఏడు వేల కేసులు దాటడంతో భారత ప్రభుత్వం కూడా అప్రమత్తమయింది. అయితే అదే సమయంలో కరోనా వైరస్ నుంచి కోలుకునే వారి సంఖ్య కూడా ఎక్కువగా ఉంది. యాక్టివ్ కేసుల సంఖ్య ఎక్కువగా పెరుగుతుండటంతో భారత ప్రభుత్వం అన్ని రాష్ట్రాలను అప్రమత్తం చేసింది.

కోవిడ్ నిబంధనలను...
దేశంలో ఏడు వేలు కొవిడ్ కేసులు దాటడంతో రాష్ట్ర ప్రభుత్వాలు కోవిడ్ నిబంధనలను కఠినంగా అమలు చేయాలని ప్రభుత్వాలను ఆదేశించింది. కోవిడ్ పరీక్షలు ఎక్కువగా చేయాలని, దీంతో పాటు కోవిడ్ ప్రత్యేక వార్డులను ఆసుపత్రుల్లో ఏర్పాటు చేయడం, ఆక్సిజన్ సిలిండర్లను ఏర్పాటు చేసుకోవడం, కోవిడ్ కు అవసరమైన మందులను కూడా సిద్ధం చేయడంపై దృష్టి పెట్టాలని కోరింది. ప్రస్తుత వేరియంట్ ప్రమాదకరం కాకపోయినప్పటికీ ప్రజల్లో అవగాహన కల్పించి అందరూ మాస్క్ లు తప్పనిసరిగా వాడేలా చర్యలు తీసుకోవాలని రాష్ట్రాలను ఆదేశించింది.
24 గంటల్లో భారత్ లో...
గడిచిన 24 గంటల్లో భారత్ లో ఆరు కొత్త కేసులు నమోదు కాగా, ఆరుగురు కరోనా కారణంగా మృతి చెందారు. దేశంలో ప్రస్తుతం 7,121 కరోనా యాక్టివ్‌ కేసులుఉన్నాయని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది. ఇప్పటి వరకూ ఈ ఏడాది ఇప్పటివరకు కొవిడ్‌తో 74 మంది మృతి చెందినట్లు కూడా వైద్య ఆరోగ్య సంస్థ ప్రకటించింది. కేరళ, ఢిల్లీ, మహారాష్ట్ర, కర్నాటక, గుజరాత్‌లో అత్యధికంగా కేసులు నమోదవుతున్నాయని, రోజు రోజుకు పెరుగుతున్న కొవిడ్‌ కేసులతో ఈ రాష్ట్రాల్లో హై అలెర్ట్ ప్రకటించింది. ఒక్క కేరళలోనే 2,223 కరోనా యాక్టివ్‌ కేసులున్నాయి. ఆంధ్రప్రదేశ్ లో 72, తెలంగాణలో 11 కొవిడ్ యాక్టివ్‌ కేసులున్నాయి. మొత్తం మీద దేశంలో కరోనా కేసులు వ్యాప్తి చెందుతుండటం ఆందోళన కలిగిస్తుంది.










Tags:    

Similar News