నేడు జనగణన నోటిఫికేషన్
భారత్ లో జనగణనకు సంబంధించి నేడు నోటిఫికేషన్ విడుదల కానుంది.
భారత్ లో జనగణనకు సంబంధించి నేడు నోటిఫికేషన్ విడుదల కానుంది. దాదాపు పదహారేళ్లు తర్వాత చేపడుతున్న జనగణణకు సంబంధించిన గెజిట్ నోటిఫికేషన్ ను నేడు ప్రభుత్వం విడుదల చేయనుంది. దేశ వ్యాప్తంగా జనగణను రెండు దశల్లో నిర్వహించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. అందులో భాగంగా తొలి దశలో జమ్మూకాశ్మీర్, లదాఖ్, ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్ లో జరుగుతుంది.
రెండు విడతలలో...
తొలి విడత జనగణన 2026 అక్టోబరు ఒకటో తేదీ నుంచి ప్రారంభం కానుంది. రెండో దశలో మిగిలిన ప్రాంతాల్లో 2027 మార్చి నుంచి జనగణన ప్రక్రియను చేపట్టనున్నారు. ఇందుకోసం 34 లక్షల మంది ఎన్యుమరేటర్లు, సూపర్ వైజర్లతో పాటు 1.34 లక్షల మంది సిబ్బంది పనిచేయడానికి సిద్ధమయ్యారు. అంతా ట్యాబ్ ల ద్వారానే ఈ సారి జనగణనను చేపట్టనున్నారు.