నేటి నుంచి ఉపరాష్ట్రపతి ఎన్నికకు నామినేషన్లు
ఉపరాష్ట్రపతి ఎన్నికకు సంబంధించి నేటి నుంచి నామినేషన్ల స్వీకరణ కార్యక్రమం ప్రారంభం కానుంది.
ఉపరాష్ట్రపతి ఎన్నికకు సంబంధించి నేటి నుంచి నామినేషన్ల స్వీకరణ కార్యక్రమం ప్రారంభం కానుంది. ఉపరాష్ట్రపతి జగ్ దీప్ థన్ ఖడ్ రాజీనామాతో ఏర్పడిన ఖాళీని భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ విడుదలయింది. వచ్చే నెల 9వ తేదీన ఉప రాష్ట్రపతి ఎన్నిక జరగనుంది. ఈ ఎన్నిక కోసం అధికారులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు.
ఈ నెల 21వ తేదీ వరకూ...
ఉప రాష్ట్రపతి ఎన్నికకు సంబంధించి ఈనెల 21 వరకు గడువు ఉంది. 25వ తేదీన నామినేషన్లను పరిశీలించనున్నారు. ఎన్డీఏ తన అభ్యర్థిని ఇంకా ఖరారు చేయలేదు. పార్లమెంటులో బలం ఉండటంతో తాము ప్రతిపాదించే వారు ఉప రాష్ట్రపతి అవుతారన్న విశ్వాసంతో అనేక పేర్లను బీజేపీ అగ్రనేతలు పరిశీలిస్తున్నారు. నామినేషన్ స్వీకరణ కార్యక్రమానికి అన్ని ఏర్పాట్లు చేశారు.