Bihar : నేడు పదోసారి బీహార్ సీఎంగా నితీష్
బీహార్ ముఖ్యమంత్రిగా నేడు నితీష్ కుమార్ ప్రమాణ స్వీకారం చేయనున్నారు
బీహార్ ముఖ్యమంత్రిగా నేడు నితీష్ కుమార్ ప్రమాణ స్వీకారం చేయనున్నారు. బీహార్ కు పదోసారి ముఖ్యమంత్రిగా ఆయన ప్రమాణ స్వీకారం చేయడం విశేషం. జేడీయూ అధినేతగా నితీష్ కుమార్ నిన్న జరిగిన ఎన్డీఏ శాసనసభపక్ష సమావేశంలో శాసనసభ పక్ష నేతగా ఎన్నికయ్యారు. తాను ఎన్నికయిన వెంటనే గవర్నర్ వద్దకు వెళ్లి ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేశారు. తర్వాత తనకు మద్దతిస్తున్న ఎమ్మెల్యేల సంతకాలతో కూడిన లేఖను గవర్నర్ కు నితీష్ కుమార్ అందచేశారు. కొత్త ప్రభుత్వం ఏర్పాటయ్యేంత వరకూ ఆపద్ధర్మ ముఖ్యమంత్రి గా కొనసాగాలని చెప్పిన గవర్నర్ నితీష్ కుమార్ రాజీనామాను ఆమోదించారు.
పదోసారి ముఖ్యమంత్రిగా...
ఈరజు ఉదయం పదకొండు గంటలకు పాట్నాలోని గాంధఈ మైదానంలో ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తారు. నితీష్ కుమార్ తో పాటు పలువురు మంత్రులు కూడా నేడు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ కార్యక్రమానికి ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షార, రక్షణ శాఖ మంత్రి రాజ్ నాధ్ సింగ్ తో పాటు ఇతర ఏన్డీఏ రాష్ట్రాల ముఖ్యమంత్రులు హాజరు కానున్నారు. ఉప ముఖ్యమంత్రిగా సామ్రాట్ చౌధురి, శాసనసభ పక్ష ఉప నేతగా విజయకుమార్ సిన్హా ఎన్నికయ్యారు. మంత్రివర్గ ప్రమాణ స్వీకారానికి సంబంధించిన ఏర్పాట్లు పూర్తయ్యాయి.