Nipah virus : కేరళలో నిఫా వైరస్ అలజడి.. పర్యాటకులు అలెర్ట్ గా ఉండాల్సిందే

కేరళలలో నిఫా వైరస్ మరోసారి అలజడి సృష్టిస్తుంది

Update: 2025-07-08 04:22 GMT

కేరళలలో నిఫా వైరస్ మరోసారి అలజడి సృష్టిస్తుంది. ఏ వైరస్ భారత్ లోకి ముందుగా ప్రవేశించినా అది కేరళలోనే ముందు తాకుతుంది. నైరుతి రుతు పవనాలు ముందుగా ప్రవేశించినట్లే వైరస్ లు కూడా కేరళను అతలాకుతలం చేస్తాయి. దీంతో ప్రజలు ఆందోళనకు గురవుతారు. నిఫా వైరస్ అత్యంత ప్రమాదకరమైన వైరస్ కావడంతో ప్రజలు కూడా భయపడిపోతుున్నారు. ఈ నెల 1వ తేదీన నిఫా వైరస్ సోకి కోజికోడ్ లో ఒక వ్యక్తి మరణించడంతో ప్రజలు భయాందోళనలకు గురవుతున్నార.అలాగే పాలక్కాడ్ కు చెందిన మరో మహిళకు కూడా ఈ నిఫా వైరస్ సోకిందని తెలిసి జాగ్రత్తగా ఉండాలని హెచ్చరికలు జారీఅయ్యాయి.

కేరళ సర్కార్ అలెర్ట్...
మరొక వైపు రాష్ట్ర ప్రభుత్వం కూడా అప్రమత్తమయింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది. తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది. ఇప్పటికే నిఫా వైరస్ సోకిందని నిర్ధారణ కావడంతో ప్రభుత్వం కూడా అనేక ఆంక్షలను విధించింది. కేరళ ప్రభుత్వం కొన్నిమార్గదర్శకాలను విడుదలచేసింది. నిఫా వైరస్ సోకిన వాళ్లు ఖచ్చితంగా క్వారంటైన్ లోనే ఉండాలని, వైరస్ సోకిన వ్యక్తితో కాంట్రాక్టు అయిన వ్యక్తులు కూడా వైద్య పరీక్షలు చేయించుకోవాలని ఆదేశాలుజారీ చేసింది. నిఫా వైరస్ రోజురోజుకూ పెరగడంతో ప్రభుత్వం ప్రజల్లో అవగాహన పెంచే కార్యక్రమాన్నిప్రారంభించింది.
లక్షణాలివే...
వైరస్ సోకిన వాళ్లకు ఎక్కువగా జలుబు, దగ్గు, జ్వరం, తలనొప్పి వంటి లక్షణాలు కనిపించినా శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు కలిగినా వెంటనే వైద్య పరీక్షలు చేయించుకోవాలని, సమీపంలోని ఆరోగ్య శాఖ అధికారులకు సమాచారం ఇవ్వాలని కూడా కేరళ ప్రభుత్వం పేర్కొంది. ఇప్పటి వరకూ ఇలాంటి లక్షణాలున్న వారిని 425 మందికి వైరస్ సోకినట్లు అనుమానాలున్నాయని అధికారులే చెబుతున్నారు. ఎక్కువ మంది మలప్పురంలో 228 మంది, పాలక్కాడ్ లో 110 మంది, కోజికోడ్ జిల్లాలో 87 మందికి వైరస్ సోకినట్లు అనుమానిస్తున్నారు. ప్రజలు ఖచ్చితంగా మాస్క్ లు ధరించాలని కూడా కేరళ ప్రభుత్వం ఆదేశించింది ఎన్ 95 మాస్క్ లను మాత్రమే వినియోగించాలని పేర్కొంది.


Tags:    

Similar News