India : నేటి ధరలు తగ్గనున్నాయ్... కొత్త జీఎస్టీ అమలుతో
నేటి నుంచి జీఎస్టీ కొత్త శ్లాబ్ లు అమలులోకి రానున్నాయి. కేంద్ర ప్రభుత్వం జీఎస్టీ సంస్కరణలను తేవడంతో ధరలు నేటి నుంచి తగ్గనున్నాయి
నేటి నుంచి జీఎస్టీ కొత్త శ్లాబ్ లు అమలులోకి రానున్నాయి. కేంద్ర ప్రభుత్వం జీఎస్టీ సంస్కరణలను తేవడంతో ధరలు నేటి నుంచి తగ్గనున్నాయి. గతంలో ఎక్కువ శ్లాబ్ లు ఉండే జీఎస్టీని కేవలం రెండు శ్లాబ్ లకు మాత్రమే పరిమితం చేసింది. దీంతో నేటి నుంచి నిత్యావసర వస్తువులతో పాటు అవసరమైన మందులు, ఆరోగ్య బీమా వంటి వస్తువుల ధరలు తగ్గనున్నాయి.
నిత్యావసరవస్తువులపై...
నిత్యావసరవస్తువులపై జీఎస్టీ పద్దెనిమిది నుంచి ఐదు శాతానికి తగ్గించడంతో ధరలు తగ్గనున్నాయి. స్టేషనరీ వస్తువులు కూడా తగ్గనున్నాయి. పాలు, నెయ్యి, పన్నీర్ వంటి వస్తువుల ధరలు కూడా ప్రజలకు అందుబాటులోకి రానున్నాయి. జీఎస్టీ లో కేంద్ర ప్రభుత్వం తెచ్చిన సంస్కరణలతో ద్విచక్ర వాహనాలతో పాటు కార్ల ధరలు కూడా నేటి నుంచి దిగి రానున్నాయి.