నేడు సీపీ రాధాకృష్ణన్ నామినేషన్

నేడు ఎన్డీఏ ఉపరాష్ట్రపతి అభ్యర్థి సీపీ రాధాకృష్ణన్ నామినేషన్ వేయనున్నారు

Update: 2025-08-20 04:24 GMT

నేడు ఎన్డీఏ ఉపరాష్ట్రపతి అభ్యర్థి సీపీ రాధాకృష్ణన్ నామినేషన్ వేయనున్నారు. సీపీ రాధాకృష్ణన్ నామినేషన్ పత్రాలపై ఎన్డీఏ పక్ష నేతలు సంతకాలు చేయనున్నారు. ఉప రాష్ట్రపతి అభ్యర్థిగా సీపీ రాధాకృష్ణన్ ను బీజేపీ ఎంపిక చేసిన సంగతి తెలిసిందే. ఆయన అభ్యర్థిత్వాన్ని ఎన్డీఏ కూటమిలోని అన్ని పార్టీలు సమర్ధించాయి. తమ మద్దతును ప్రకటించాయి.

నామినేషన్ కార్యక్రమానికి...
సీపీ రాధాకృష్ణన్ నామినేషన్ కార్యక్రమంలో పాల్గొననున్న ఎన్డీఏ నేతలందరూ పాల్గొననున్నారు. తమిళనాడుకు చెందిన సీపీ రాధాకృష్ణన్ మహారాష్ట్ర గవర్నర్ గా పనిచేస్తున్నారు. ఆయన నామినేషన్ కార్యక్రమంలో ప్రధాని నరేంద్ర మోదీతో పాటు కేంద్ర మంత్రులు కూడా పాల్గొననున్నారు. ఉభయ సభల్లో తగిన బలం ఉండటంతో తమదే గెలుపు అని ఎన్డీఏ భావిస్తుంది.


Tags:    

Similar News