కేజ్రీవాల్ కు మోదీ వార్నింగ్

తప్పుడు హమీలతో అధికారంలోకి రాలేరని నరేంద్రమోదీ అన్నారు. పరోక్షంగా ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ కు హెచ్చరించారు

Update: 2022-12-11 07:59 GMT

తప్పుడు హమీలతో అధికారంలోకి రాలేరని నరేంద్రమోదీ అన్నారు. పరోక్షంగా ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ కు చురకలంటించారు. షార్ట్ కట్ లో రాజకీయంగా ఎదగాలనుకునేవారు ఎన్నటికీ ఎదగరని అన్నారు. రాజకీయాల్లో దొడ్దిదారి ఉండదని అని అన్నారు. వారందరినీ హెచ్చరిస్తున్నానని తెలిపారు. అలా ఉచితాలతో దేశాభివృద్ధి జరగదని, అలా హామీలిచ్చేవారంతా దేశానికి శత్రువులని మోదీ అభిప్రాయపడ్డారు. వారంతా అభివృద్ధి ప్రాధాన్యతను గుర్తించాలన్నారు. ఇటీవల గుజరాత్ ఎన్నికల్లో కేజ్రీవాల్ ఉచిత హామీలిచ్చిన సంగతి తెలిసిందే. అయినా అక్కడ బీజేపీ అధికారంలోకి వచ్చింది. కేజ్రీవాల్ పేరు ఎత్తకుండా ఆయన ఈ విమర్శలు చేశారు.

ముంబై - నాగపూర్ రహదారిని....
ముంబై - నాగపూర్ రహదారిని ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించారు. విదర్భ, మరఠ్వాడ, ఉత్తర మహారాష్ట్ర అభివృద్ధికీ ఈ ఎక్స్‌ప్రెస్ వే దోహదపడుతుందన్నారు. ఈ రహదారి నిర్మాణంతో ముంబయి- నాగపూర్ లమధ్య ప్రయాణం ఏడు గంటలు తగ్గుతుందని ఆయన అన్నారు. దీంతో పాటు నాగ్‌పూర్ నుంచి షిర్డీ వరకూ 520 కిలోమీటర్ల ఎక్స్‌ప్రెస్ వే మొదటి దశ పనులు పూర్తయ్యాయని చెప్పారు.


Tags:    

Similar News