Narendra Modi : నేడు ఛత్తీస్ గఢ్ కు నరేంద్ర మోదీ
ప్రధాని నరేంద్ర మోదీ నేడు ఛత్తీస్ గఢ్ లో పర్యటించనున్నారు.
ప్రధాని నరేంద్ర మోదీ నేడు ఛత్తీస్ గఢ్ రాష్ట్రంలో పర్యటించనున్నారు. పలు అభివృద్ధి కార్యక్రమాలలో ప్రధాని మోదీ పాల్గొననున్నారు. అనేక కార్యక్రమాలకు ప్రధాని మోదీ ఈ పర్యటనలో శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలను చేయనున్నారు. మాజీ ప్రధాని దివంగత వాజ్ పేయి విగ్రహాన్ని కూడా ప్రధాని నరేంద్ర మోదీ ఆవిష్కరించనున్నారు.
పలు కార్యక్రమాల్లో...
ఛత్తీస్ గఢ్ రాష్ట్రం ఏర్పడి నేటికి ఇరవై ఐదేళ్లు కావస్తుంది. దీంతో పలు కార్యక్రమాలను ప్రభుత్వం నిర్వహిస్తుంది. అనంతరం ప్రధాని నరేంద్ర మోదీ బహిరంగ సభలో పాల్గొంటారు. ప్రధాని నరేంద్ర మోదీ సభకు అవసరమైన అన్ని ఏర్పాట్లను ప్రభుత్వం ఇప్పటికే పూర్తి చేసింది. ప్రధాని పర్యటించే ప్రాంతాల్లో భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. ట్రాఫిక్ ఆంక్షలు అమలులోకి రానున్నాయి.