గుజరాత్ కైట్ ఫెస్టివల్ లో ప్రధాని మోదీ

గుజరాత్ లో జరుగుతున్న కైట్ ఫెస్టివల్ లో భారత ప్రధాని నరేంద్ర మోదీ పాల్గొన్నారు

Update: 2026-01-12 06:36 GMT

గుజరాత్ లో జరుగుతున్న కైట్ ఫెస్టివల్ లో భారత ప్రధాని నరేంద్ర మోదీ పాల్గొన్నారు. గుజరాత్ లోని సబర్మతి పరివాహక ప్రాంతంలో పతంగుల సందడిని ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించారు. గుజరాత్ లో పొంగల్ సందర్భంగా ఇంటర్నేషనల్ కైట్ ఫెస్టివల్ ను నిర్వహిస్తున్నారు. అనేక సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. జర్మనీ ఛాన్సిలర్ ఫెడ్రిక్ మెర్జ్ తో కలసి పతంగులను మోదీ ఎగురు వేశారు.

దేశం నలుమూలల నుంచి...
కళాకారుల సంగీతం, నృత్య ప్రదర్శనలు, గీతాలు అందరినీ ఆకట్టుకున్నాయి. ప్రధాని మోదీ, జర్మనీ ఛాన్సిలర్ ఫెడ్రిక్ మెర్జ్ కి కళాకారులు సంప్రదాయ రీతిలో స్వాగతం పలికారు. గుజరాత్ లో జరగనున్న భారత్ నలుమూలల నుంచి పంతంగులు వేసేందుకు తరలి వచ్చారు. కైట్ ఫెస్టివల్ ను చూసేందుకు ఇతర దేశాల నుంచి తరలి రావడం విశేషం.


Tags:    

Similar News