Karnataka : నందిని నెయ్యి ధర భారీగా పెంపు
కర్ణాటకలో నందిని నెయ్యి ధర పెరిగింది. లీటరుకు డెబ్భయి రూపాయలు పెంచుతూ కర్ణాటక మిల్క్ ఫెడరేషన్ నిర్ణయం తీసుకుంది
కర్ణాటకలో నందిని నెయ్యి ధర పెరిగింది. లీటరుకు డెబ్భయి రూపాయలు పెంచుతూ కర్ణాటక మిల్క్ ఫెడరేషన్ నిర్ణయం తీసుకుంది. దీంతో నందిని నెయ్యి ధర లీటరుకు 700 రూపాయలకు చేరింది. లీటరుకు 90 రూపాయల పెంపును కర్ణాటక మిల్క్ ఫెడరేషన్ ప్రకటించింది. ఈ నిర్ణయం అంతర్జాతీయ మార్కెట్‌లో వ్యయాలు భారీగా పెరగడంతో తీసుకున్నట్లు అధికారులు తెలిపారు.
ఏడు వందలకు చేరిన...
ప్రపంచవ్యాప్తంగా డిమాండ్ పెరగడంతో ధరలు పెరుగుతున్నాయని. అయినా మన నెయ్యి ధరలు ఇంకా తక్కువగానే ఉన్నాయని, ఆర్థికంగా నిలకడగా ఉండేందుకు ఈ సవరణ అవసరమైందని కర్ణాటక మిల్క్ ఫెడరేషన్ అధికారులు తెలిపారు. తాజాగా జీఎస్టీ స్లాబ్‌లలో తగ్గింపుతో నందిని నెయ్యి ధర లీటరుకు రూ.640 నుంచి రూ.610కి తగ్గిన సంగతి తెలిసిందే. ఇప్పడు ధరలు పెరగడంతో ఏడు వందల రూపాయలకు పెరిగింది.