మావోయిస్టు అగ్రనేత నంబాల శంకరరావు మృతి
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబుపై అలిపిరిలో బాంబుదాడి ప్రధాన సూత్రధారి నంబాల కేశవరావు ఎన్ కౌంటర్ లో మరణించారు
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబుపై అలిపిరిలో బాంబుదాడి ప్రధాన సూత్రధారి నంబాల కేశవరావు ఎన్ కౌంటర్ లో మరణించారు. 2010లో 76 మంది సీఆర్పీఎఫ్ జవాన్ల మృతిలోనూ నంబాల కేశవరావుదే కీలకపాత్ర. మావోయిస్టు అగ్రనేత గణపతి రాజీనామాతో 2018 పార్టీకి సుప్రీం కమాండర్ గా బాధ్యతలు చేపట్టిన నంబాల కేశవరావు పార్టీలో అంచెలంచెలంచెలుగా ఎదిగారు. వరంగల్ జిల్లాలో చదివిన నంబాల కేశవరావు మావోయిస్టుల ఉద్యమాల పట్ల ఆకర్షితుడై అడవి బాటపట్టారు. అనేక కేసుల్లో ప్రధాన సూత్రధారి. కోటిన్నర రివార్డు ఈయనపై ప్రభుత్వం ఉంది. గెరిల్లా వ్యూహాలు రచించడం, ఐఈడీలు పేల్చడంలో నంబాల కేశవరావు దిట్ట. వరంగల్ ఆర్ఈసీలో ఇంజినీరింగ్ చేసిన నంబాల కేశవరావు ఎంటెక్ చేస్తున్న సమయంలో నక్సలిజానికి ఆకర్షితుయ్యాడు. ఆయన తండ్రి ఉపాధ్యా యుడుగా పనిచేశారు.
శ్రీకాకుళం జిల్లాలో పుట్టి...
1955లో శ్రీకాకుళం జిల్లా జియ్యన్నపేటలో జన్మించిన కేశవరావు వరంగల్ రీజనల్ ఇంజనీరింగ్ కాలేజీలో ఇంజనీరింగ్ చేశారు. ఆర్ఈసీలో చదువుతున్నప్పుడే పీపుల్స్‌వార్‌లో చేరి అంచెలంచెలుగా ఎదిగారు. 1970ల నుంచే నక్సలైట్ ఉద్యమంలో చురుగ్గా ఉన్న కేశవరావు 1980లో ఒకసారి అరెస్ట్ అయిన నంబాల కేశవరావు 1987లో బస్తర్ అడవుల్లో కేశవరావు ఎల్టీటీఈ నుంచి శిక్షణ పొందారు. అంబుష్ టాక్టిక్స్, జిలెటిన్ హ్యాండ్లింగ్‌లో కేశవరావుకు శిక్షణ ఇచ్చారు. 1992లో పీపుల్స్ వార్ సెంట్రల్ కమిటీ సభ్యుడిగా ఎన్నికైన కేశవరావు 2018లో మావోయిస్టు ప్రధాన కార్యదర్శిగా నియమితులయ్యారు. మావోయిస్టు పార్టీ ప్రధాన కార్యదర్శి ఎన్‌కౌంటర్ కావడం ఇదే తొలిసారి. ప్రస్తుతం మావోయిస్టు పార్టీ జనరల్ సెక్రటరీగా ఉన్నారు.