మైసూరు జిల్లాలో మనిషిని ఎత్తుకెళ్లిన పులి.. సోషల్ మీడియాలో వీడియో వైరల్

మైసూరు జిల్లాలో శుక్రవారం పులి దాడిలో రైతు మరణించారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

Update: 2025-11-07 13:08 GMT

మైసూరు జిల్లాలో శుక్రవారం పులి దాడిలో రైతు మరణించారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. కర్ణాటక అటవీశాఖ మంత్రి ఈశ్వర్‌ ఖాండ్రే తక్షణమే నాగరహోలు, బందీపూర్‌ టైగర్‌ రిజర్వుల్లో సఫారీ కార్యకలాపాలను నిలిపివేయాలని ఆదేశించారు. ట్రెక్కింగ్‌ను కూడా తాత్కాలికంగా నిషేధించారు. మైసూరు జిల్లా సరుగూరు తాలూకాలోని హలే హెగ్గుడిలు గ్రామానికి చెందిన చౌడయ్య నాయక్‌ పై పులి దాడి జరగగా, అక్కడికక్కడే మృతి చెందినట్లు అధికారులు తెలిపారు. ఇదే ప్రాంతంలో గత నెలలో పులి దాడిలో ఇది మూడో మరణమని అధికారులు వివరించారు.

సఫారీ కార్యక్రమాలను...
గత నెలలో మైసూరు, చామరాజనగర్‌ జిల్లాల అరణ్య ప్రాంతాల్లో పులి దాడులతో ముగ్గురు మృతి చెందడం ఆందోళన కలిగించింది. ఈ నేపథ్యంలో అక్టోబర్‌ 27న రైతులు, స్థానికులతో చర్చలు జరిపి, అవసరమైతే సఫారీ నిలిపివేస్తామని ముందుగా హెచ్చరించామని, అయినా మరొక విషాదం చోటుచేసుకోవడం విచారకరమని మంత్రి ఖాండ్రే అన్నారు. ప్రస్తుతం సఫారీ డ్రైవర్లు, సిబ్బంది అందరినీ పులి పట్టుకునే ఆపరేషన్‌లో భాగస్వాములుగా మోహరించాలని ఆయన స్పష్టం చేశారు. అలాగే ఈ ప్రాంతంలోనే శిబిరం ఏర్పాటు చేసి చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.


Tags:    

Similar News