హత్య కేసులో మాజీ ఎంపీకి జీవిత ఖైదు 28 ఏళ్లకు బాధిత కుటుంబాలకు న్యాయం

హత్య కేసులో ఆర్జేడీ నాయకుడు, బీహార్ మాజీ ఎంపీ ప్రభునాథ్ సింగ్ కి సుప్రీంకోర్టు జీవిత ఖైదు విధించింది.

Update: 2023-09-01 12:10 GMT

హత్య కేసులో మాజీ ఎంపీకి జీవిత ఖైదు

28 ఏళ్లకు బాధిత కుటుంబాలకు న్యాయం

హత్య కేసులో ఆర్జేడీ నాయకుడు, బీహార్ మాజీ ఎంపీ ప్రభునాథ్ సింగ్ కి సుప్రీంకోర్టు జీవిత ఖైదు విధించింది. 1995లో బీహార్ అసెంబ్లీ ఎన్నికల సమయంలో సరన్ జిల్లాలో పోలింగ్ రోజున ఇద్దరు వ్యక్తుల హత్య కేసులో ప్రభునాథ్ సింగ్ ని దోషిగా నిర్థారించిన సుప్రీం..ఆయనకు జీవితఖైదు విధిస్తూ శుక్రవారం (సెప్టెంబర్ 1న) తీర్పు వెలువరించింది. హత్యలు జరిగిన 28 ఏళ్ల తర్వాత బాధిత కుటుంబాలకు న్యాయం జరిగింది.

చప్రాకు చెందిన ఇద్దరు వ్యక్తులు తనకు వ్యతిరేకంగా ఓటు వేయడంపై ప్రభునాథ్‌ సింగ్‌ ఆగ్రహంతో వారిపై గన్‌తో కాల్పులు జరిపి హత్య చేశాడన్న ఆరోపణలపై విచారణ జరిపిన దేశ అత్యున్నత ధర్మాసనం ఐపీసీలోని సెక్షన్ 302,307 కింద ఆయనని ఆగస్టు 18న దోషిగా నిర్థారించింది. ఈ కేసులో ప్రభునాథ్ సింగ్‌ ను నిర్దోషిగా ప్రకటించిన ట్రయల్ కోర్టు, పాట్నా హైకోర్టు ఆదేశాలను తోసిపుచ్చుతూ ఆగస్టు 18న సుప్రీంకోర్టు..ప్రభునాథ్ సింగ్‌ను దోషిగా నిర్ధారించింది.

ఇది అసాధారణంగా జరిగే బాధాకర సంఘటన అని,ఇలాంటి కేసు ఎప్పుడూ చూడలేదని ఈ సందర్భంగా సుప్రీంకోర్టు పేర్కొంది. అయితే దేశంలోని పలు చోట్ల ఇలాంటి ఘటనలు జరుగుతున్నా బాధితులకు ఏళ్ల తరబడి న్యాయస్థానాల్లో పోరాటాలు జరిపే శక్తిలేకపోవడంతో న్యాయం జరగడం లేదని ప్రజలు భావిస్తున్నారు. తనకు వ్యతిరేకంగా ఆధారాలు లేకుండా చేసేందుకు ప్రభునాథ్ సింగ్ అన్ని ప్రయత్నాలు చేసినట్లు కోర్టు తెలిపింది. ఇక, బాధిత కుటుంబాలకు రూ.10 లక్షల చొప్పున పరిహారం చెల్లించాలని బీహార్‌ ప్రభుత్వాన్ని సుప్రీంకోర్టు ఆదేశించింది

Tags:    

Similar News