నేడు హిడ్మా అంత్యక్రియలు
మోస్ట్ వాంటెడ్ మావోయిస్టు నేత హిడ్మా అంత్యక్రియలు జరగనున్నాయి
మోస్ట్ వాంటెడ్ మావోయిస్టు నేత హిడ్మా ఎన్‌కౌంటర్‌లో మృతి చెందడంతో ఆయన స్వగ్రామమైన ఛత్తీస్‌గఢ్‌లోని పువర్తిలో తీవ్ర విషాద ఛాయలు అలముకున్నాయి. దక్షిణ సుక్మా జిల్లాలోని ఈ మారుమూల గ్రామంలోని యాభై ఇళ్లలో సగానికి పైగా ఇళ్లకు తాళాలు వేసి ఉన్నాయి. గ్రామస్థులు దిగాలుగా కనిపించగా, హిడ్మా కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరవుతున్నారు.
సొంత గ్రామంలో...
నడవలేని స్థితిలో ఉన్న హిడ్మా తల్లి మాంజు, ఇతర బంధువులు బోరున విలపిస్తున్నారు. బుధవారం రాత్రి వరకు మృతదేహం గ్రామానికి చేరుకోలేదు. సెల్‌ఫోన్‌లో ఫోటో చూసిన తర్వాతే మరణించింది హిడ్మానే అని పోలీసులకు ధ్రువీకరించినట్లు గ్రామస్థులు తెలిపారు. గురువారం మృతదేహం వస్తుందని ఎదురుచూస్తున్నారు. పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.