21 నుంచి పార్లమెంటు సమావేశాలు

ఈ నెల 21 నుంచి పార్లమెంట్‌ వర్షాకాల సమావేశాలు ప్రారంభం కానున్నాయి.

Update: 2025-07-03 03:01 GMT

ఈ నెల 21 నుంచి పార్లమెంట్‌ వర్షాకాల సమావేశాలు ప్రారంభం కానున్నాయి. వర్షాకాలం సమావేశాలు హాట్ హాట్ గా కొనసాగనున్నాయి. అనేక అంశాలు ఉభయ సభలను కుదిపవేయనున్నాయి. ఇటు అధికార పక్షం పార్లమెంటు వర్షా కాల సమావేశాలకు రెడీ అవుతుండగా, విపక్షాలు కూడా విమర్శల దాడికి సిద్ధమవుతుంది.

వర్షాకాలంలో వేడి వేడిగా...
పహాల్గామ్ దాడి, ఆపరేషన్ సింధూర్ తర్వాత కాల్పుల విరమణ ఒప్పందం వంటి కీలక అంశాలపై ఇండి కూటమి ప్రభుత్వాన్ని నిలదీయాలన్న యోచనలో ఉంది. అదే సమయంలో విపక్షాల విమర్శలకు ధీటుగా సమాధానం చెప్పేందుకు అధికార పక్షం సిద్ధమవుతుంది. ఈ నెల 21వ తేదీన ప్రారంభమయ్యే పార్లమెంటుసమావేశాలు ఆగస్టు 21 వరకు కొనసాగనున్నాయి. పార్లమెంట్‌ వర్షాకాల సమావేశాలకు సంబంధించి గెజిట్‌ జారీ అయింది.


Tags:    

Similar News