Narendra Modi : నేడు మరో ప్రతిష్టాత్మక పథకాన్ని ప్రారంభించనున్న మోదీ

ఈరోజు పీఎం-సేతు పథకాన్ని ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించనున్నారు

Update: 2025-10-04 03:30 GMT

ఈరోజు పీఎం-సేతు పథకాన్ని ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించనున్నారు. ఉదయం 11 గంటలకు ఢిల్లీ విజ్ఞాన్ భవన్‍లో పీఎం-సేతు పథకం ప్రారంభిస్తారు. విద్యా, నైపుణ్యాభివృద్ధికి పథకం తోడ్పడుతుందని మోదీ అభిప్రాయంం వ్యక్తం చేశారు. దేశవ్యాప్తంగా యువతకు విద్య, నైపుణ్యాభివృద్ధి, స్వయం ఉపాధి రంగాల్లో ఊపిరి పోసేలా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ శనివారం రూ.62 వేల కోట్లకు పైగా విలువైన పథకాలను ప్రారంభించనున్నారు. ఈ సందర్భంగా బీహార్‌ పునర్నవీకరించిన *‘ముఖ్యమంత్రి నిశ్చయ స్వయం సహాయ భట్టా యోజన’*ను కూడా ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభిస్తారు.

అరవై కోట్లు కేటాయించిన...
ప్రధానమంత్రి కార్యాలయం అందించిన సమాచారం మేరకు మోదీ ‘ప్రధాన్ మంత్రి స్కిల్లింగ్ అండ్ ఎంప్లోయబిలిటీ ట్రాన్స్‌ఫర్మేషన్ త్రూ అప్‌గ్రేడెడ్ ఐటీఐలు ’ పథకాన్ని ప్రారంభించనున్నారు. ఈ కేంద్ర పథకానికి రూ.60 వేల కోట్లు కేటాయించారు. దేశవ్యాప్తంగా 1,000 ప్రభుత్వ ఐటీఐలను హబ్-స్పోక్‌ మోడల్‌లో అభివృద్ధి చేయనున్నారు. ఇందులో 200 హబ్‌ ఐటీఐలు, వాటికి అనుబంధంగా 800 స్పోక్‌ ఐటీఐలు ఉంటాయి. ఆధునిక వసతులు, డిజిటల్‌ లెర్నింగ్‌ సిస్టమ్స్‌, ఇన్క్యూబేషన్‌ సౌకర్యాలతో ఈ క్లస్టర్లు అంతర్జాతీయ ప్రమాణాలకనుగుణంగా తీర్చిదిద్దనున్నారు. వరల్డ్‌ బ్యాంక్‌, ఆసియా డెవలప్‌మెంట్‌ బ్యాంక్‌ సహకారంతో ఈ పథకం అమలు అవుతుంది. మొదటి దశలో పట్నా, దర్భంగా ఐటీఐలకు ప్రత్యేక ప్రాధాన్యం ఇవ్వనున్నారు.
వృత్తి విద్యా నైపుణ్య ల్యాబ్ లను...
ప్రధానమంత్రి మరో 1,200 వృత్తి నైపుణ్య ల్యాబ్స్‌ను ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించనున్నారు. వీటిని 34 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల పరిధిలోని 400 నవోదయ విద్యాలయాలు, 200 ఏకలవ్య మోడల్‌ రెసిడెన్షియల్‌ పాఠశాలల్లో ఏర్పాటు చేశారు. సమాచార సాంకేతికం, ఆటోమొబైల్‌, వ్యవసాయం, ఎలక్ట్రానిక్స్‌, లాజిస్టిక్స్‌, టూరిజం తదితర పన్నెండు రంగాల్లో విద్యార్థులకు ప్రత్యక్ష శిక్షణ అందించడానికి వీటిని సిద్ధం చేశారు. గిరిజన, దూర ప్రాంతాల విద్యార్థులు కూడా ఈ ల్యాబ్స్‌ ద్వారా లబ్ధిపొందనున్నారు. జాతీయ విద్యా విధానం 2020, సీబీఎస్ఈ పాఠ్యప్రణాళికలకు అనుగుణంగా వీటిని అమలు చేస్తున్నారు. ఇందుకోసం 1,200 మంతి వృత్తి ఉపాధ్యాయులను కూడా శిక్షణ ఇవ్వనున్నారు


Tags:    

Similar News