Narendra Modi : విపక్షాలకు ప్రధాని వినతి ఇదే
పార్లమెంటు శీతాకాల సమావేశంలో విపక్షాలు ప్రభుత్వానికి సహకరించాలని ప్రధాని నరేంద్రమోదీ కోరారు
పార్లమెంటు శీతాకాల సమావేశంలో విపక్షాలు ప్రభుత్వానికి సహకరించాలని ప్రధాని నరేంద్రమోదీ కోరారు. ఫలవంతమైన చర్చలు జరిగేలా చూడాలని ఆయన కోరారు. పార్లమెంట్ శీతాకాల సమావేశానికి ముందు దేశాన్ని ఉద్దేశించి ప్రధాని నరేంద్ర మోదీ మాట్లాడారు. ఈ సమావేశం ప్రజల కోసం ఫలప్రదంగా ఉండేలా ప్రతిపక్షం సహకరించాలని కోరారు. బీహార్ ఎన్నికల ఫలితాల తర్వాత ప్రతిపక్షం ఇంకా అసౌకర్యంగానే కనిపిస్తోందని ఆయన వ్యాఖ్యానించారు. విభేదాలు పక్కన పెట్టి మంచి విధానాలు, చట్టాలపై కలిసి పనిచేయాలని పిలుపునిచ్చారు. వర్షాకాల సమావేశంలో జరిగిన అంతరాయాలు మళ్లీ పునరావృతం కాకూడదని చెప్పారు.
చర్చించాల్సిన అంశాలపైనే...
చర్చించాల్సిన విషయాలపైనే అందరూ దృష్టి పెట్టాలని, డ్రామా చేసేందుకు చాలా చోట్లుంటాయని ప్రధాని తెలిపారు. రాజకీయాల్లో నెగిటివిటీ ఉపయోగపడినా దేశ నిర్మాణానికి పాజిటివ్ ఆలోచనలు తప్పనిసరిగా అవసరమని ప్రధాని చెప్పారు. నెగిటివిటీని పక్కన పెట్టాలని సూచించారు. ప్రతిపక్షం బలమైన, ప్రజలకు సంబంధించిన అంశాల్ని ముందుకు తేవాలని కోరుతూ… బీహార్ ఓటమి తర్వాత వారు ఇంకా కోలుకోకపోవడం ఆశ్చర్యంగా ఉందని వ్యాఖ్యానించారు. వారు ఇంతలోనే కోలుకుని ఉండాలి అనుకున్నానని, నిన్న చూసినప్పుడు ఆ ఓటమి వారిని స్పష్టంగా ప్రభావితం చేసినట్టే కనిపించిందని మోదీ వ్యాఖ్యానించారు. .