నేడు మాక్ డ్రిల్.. ఉగ్రదాడి నేపథ్యంలో
నేడు భారత్ వ్యాప్తంగా మాక్ డ్రిల్ జరగనుంది. పాకిస్థాన్, భారత్ ల మధ్య ఉద్రిక్తతలు కొనసాగుతున్న నేపథ్యంలో సెక్యురిటీ మాక్ డ్రిల్స్ చేయాలని నిర్ణయించింది
మోక్ డ్రిల్ల్ ఇండియా పాకిస్తాన్ వార్
నేడు భారత్ వ్యాప్తంగా మాక్ డ్రిల్ జరగనుంది. పహల్గాం ఉగ్రదాడి నేపథ్యంలో పాకిస్థాన్, భారత్ ల మధ్య ఉద్రిక్తతలు కొనసాగుతున్న నేపథ్యంలో సెక్యురిటీ మాక్ డ్రిల్స్ చేయాలని నిర్ణయించింది. దేశంలో మొత్తం 259 ప్రాంతాల్లో మాక్ డ్రిల్స్ చేయనున్నారు. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. యుద్ధం వస్తే పౌరులు ఎలాంటి ముందు జాగ్రత్తలు తీసుకోవాలి? ప్రాణాలు ఎలా కాపాడుకోవాలన్న దానిపై ఈ మాక్ డ్రిల్స్ ను నిర్వహించనున్నారు. ప్రధానంగా దేశ సరిహద్దురాష్ట్రాల్లో బంకర్లను నిర్మించుకోవడంతో పాటు ఉన్నవాటిని శుభ్రం చేసుకుని సిద్ధం చేయాలని ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం పౌరులకు సూచించింది.
హైదరాబాద్ లో నాలుగు ప్రాంతాల్లో...
హైదరాబాద్ లోనూ ఈరోజు నాలుగు ప్రాంతాల్లో మాక్ డ్రిల్స్ నిర్వహిస్తున్నార. కంచన్ బాగ్ డీఆర్డీవో, మౌలాలి,ఎన్.ఎఫ్.సి, సికింద్రాబాద్, గోల్కొండ ప్రాంతాల్లో ఈ మాక్ డ్రిల్స్ ను నిర్వహించనున్నారు. సాయంత్రం నాలుగు గంటలకు మాక్ డ్రిల్స్ ను నిర్వహించనున్నారు. ఆపరేషన్ అభ్యాస్ పేరుతో మాక్ డ్రిల్ నిర్వహించేందుకు అధికారులు అన్ని ఏర్పాట్లుచేశారు. నాలుగు గంటలకు సైరన్ మోగిన వెంటనే బహిరంగ ప్రాంతాల్లో ఉన్న ప్రజలు సురక్షిత ప్రాంతాలకుతరలి వెళ్లాలి్సి ఉంటుంది. పోలీసులతో పాటు అగ్నిమాపక సిబ్బంది, ఎన్డీఆర్ఎఫ్, వైద్యశాఖ, రెవెన్యు అధికారులు అత్యవసర పరిస్థితుల్లో ప్రజలు ఎలా తమ ప్రాణాలు రక్షించుకోవాలో అవగాహన కల్పించనున్నారు.