Goa : గోవాలో విదేశీయుల సంఖ్య తగ్గడానికి ఇడ్లీ, సాంబారే కారణం

గోవాలో టూరిజాన్ని దెబ్బతీస్తుంది ఇడ్లీ, సాంబారు అంటూ ఎమ్మెల్యే సంచలన కామెంట్స్ చేశారు

Update: 2025-02-28 05:24 GMT

గోవాలో టూరిజాన్ని దెబ్బతీస్తుంది ఇడ్లీ, సాంబారు అంటూ ఎమ్మెల్యే సంచలన కామెంట్స్ చేశారు. పర్యాటకుల సంఖ్య తగ్గడానికి అదే కారణమని బీజేపీ ఎమ్మెల్యే మైఖేల్ లోబో వ్యాఖ్యానించారు. గత కొంతకాలంగా గోవాలో పర్యాటకుల సంఖ్య తగ్గడానికి ఇడ్లీ సాంబారు మాత్రమే కారణమని ఆయన అన్నారు. వడ్ పావ్ లు కూడా మరొక కారణమన్న ఆయన బెంగళూరు నుంచి వచ్చిన వారు బీచ్ లలో వడా పావ్ లు అమ్ముతున్నారని, ఇంకొందరు ఇడ్లీ సాంబారు విక్రయిస్తున్నారని తెలిపారు.

రెండేళ్లుగా...
అందుకే గత రెండేళ్లుగా గోవాకు పర్యాటకుల సంఖ్య తగ్గిందని తెలిపారు. దీంతో పాటు యుద్ధాల కారణంగా కూడా గోవా పర్యటనను తగ్గించుకున్నారని, అందువల్లనే పర్యాటక రంగంలో గణనీయమైన ఆదాయాన్ని తమ ప్రభుత్వం కోల్పోవాల్సి వచ్చిందని ఆయన అన్నారు. ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన వారికి షాపులు అద్దెకు ఇవ్వడం కూడా గోవా బ్రాండ్ ఇమేజ్ దెబ్బతినడానికి కారణమని ఆయన అనడం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. దీనిపై ప్రభుత్వం చర్చించి తగిన చర్యలు తీసుకోవాలని ఆయన సూచించారు.


Tags:    

Similar News