Operatin Sindoor : పాక్ మత ఘర్షణలను సృష్టించే యత్నంలో దాడులు చేసింది

భారత్ కు చెందిన సైనిక స్థావరాలను లక్ష్యంగా చేసుకుని పాకిస్తాన్ దాడులకు తెగపడిందని పై విదేశాంగ శాఖ,రక్షణ శాఖలు సంయుక్తంగా మీడియా సమావేశంలో తెలిపారు

Update: 2025-05-09 12:29 GMT

నిన్న రాత్రి భారత్ కు చెందిన సైనిక స్థావరాలను లక్ష్యంగా చేసుకుని పాకిస్తాన్ దాడులకు తెగపడిందని పై విదేశాంగ శాఖ,రక్షణ శాఖలు సంయుక్తంగా మీడియా సమావేశంలో తెలిపారు. విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిస్రీ, కల్నల్ సోఫియా ఖురేషీ, వింగ్ కమాండర్ వ్యోమికా సింగ్ నిన్న, ఈరోజు జరిగిన ఘటనలపై దేశ ప్రజలకు వివరించారు. పాకిస్తాన్ ప్రయోగించిన డ్రోన్లను సమర్థవంతంగా కూల్చివేశామని చెప్పారు. నాలుగు ఎయిర్ పోర్టులు లక్ష్యంగా పాక్ దాడులకు యత్నించిందని తెలిపారు. భారత్ గగనతలంలోకి పాక్ డ్రోన్లు, క్షిపణులు, యుద్ధవిమానాలు వచ్చాయని వివరించారు. భారత మిలటరీ స్థావరాలను పాక్ లక్ష్యంగా చేసుకుని దాడులకు దిగిందని చెప్పారు. పాక్ ఉపయోగించిన డ్రోన్లు టర్కీవి చెందినవిగా ఫోరెన్సిక్ పరీక్షల ద్వారా గుర్తించామని వారు తెలిపారు.భటిండా, ఉధంపూర్ ఎయిర్ పోర్టులు లక్ష్యంగా చేసుకుని దాడులకు పాకిస్తాన్ ప్రయత్నించిందని చెప్పారు.

డ్రోన్లతో తెగబడుతూ...
మూడు వందల నుంచి నాలుగు వందల డ్రోన్లతో పాకిస్తాన్ దాడులకు ప్రయత్నించిందని రక్షణశాఖ, విదేశాంగ అధికారులు తెలిపారు. అయితే అన్నింటిని సమర్థంగా కూల్చివేశామని చెప్పారు. పాక్ ముప్ఫయి ఆరు చోట్ల చొరబాటుకు ప్రయత్నించిందని తెలిపారు. సరిహద్దుల్లో భారీ ఆర్టిలరీతో కాల్పులకు తెగబడుతుందని అన్నారు. పౌర విమానాలను రక్షణగా వాడుకుంటూ పాక్ దాడులకు ప్రయత్నిస్తుందని చెప్పారు. అంతర్జాతీయ ప్రయాణికులను దృష్టిలో పెట్టుకుని భారత్ సంయమనం పాటించిందని అన్నారు. భారత్ ఎదురుదాడిలో పాక్ సైన్యానికి భారీగా నష్టం జరిగిందని వారు వివరించారు.భారత్ లోని పలు నగరాలను కూడా లక్ష్యంగా చేసుకుని దాడులకు యత్నించిందని తెలిపారు.
ఎల్ఓసీ వెంట కాల్పులు...
ఎల్.ఓ.సి వెంట పాక్ సైన్యం నిరంతరం కాల్పులకు దిగుతుందని అన్నారు. భారత్ సైన్యం దానికి దీటైన జవాబు చెబుతుందని అన్నారు. గురుద్వారా, , ప్రార్థనాలయాల మీద దాడులు చేయడం ద్వారా పాకిస్తాన్ దేశంలో మత ఘర్షణలు తలెత్తేలా ప్లాన్ చేసిందన్నారు. ప్రపంచాన్ని తప్పుదోవ పట్టించేందుక పాక్ ఇప్పటికీ ప్రయత్నిస్తుందని తెలిపారు. లేహ్ నుంచి సర్ క్రిక్ వరకూ 36 చోట్ల దాడులకు పాక్ ప్రయత్నించిందని చెప్పారు. ఇప్పటికే పాకిస్తాన్ తీరుపై అన్ని ప్రపంచ దేశాలతో పాటు ఐక్యరాజ్యసమితికి కూడా ఫిర్యాదు చేశామని చెప్పారు. అమాయకుల ప్రాణాలు పోకుండా అన్ని చర్యలను భద్రతా బలగాలు తీసుకుంటున్నాయని, ముందస్తు చర్యలు చేపట్టామని తెలిపారు. ఈరోజు జరిగే ఐఎంఎఫ్ సమావేశంలో పాక్ కు సాయం చేయవ్దని తాము కోరతామని వివరించారు.


Tags:    

Similar News