భారత్ లో మైక్రోసాఫ్ట్ భారీ పెట్టుబడులు

భారత్‌లో భారీ పెట్టుబడులకు మైక్రోసాఫ్ట్ సంసిద్ధత తెలిపింది

Update: 2025-12-10 02:28 GMT

భారత్‌లో భారీ పెట్టుబడులకు మైక్రోసాఫ్ట్ సంసిద్ధత తెలిపింది. భారత్‌లో 1.58 లక్షల కోట్ల పెట్టుబడులకు మైక్రోసాఫ్ట్ సంసిద్ధత వ్యక్తం చేసింది. ఆసియాలోనే అతిపెద్ద పెట్టుబడులు భారత్ లో మైక్రోసాఫ్ట్ పెడుతోంది. - భారత్‌లో పెట్టుబడులపై మైక్రోసాఫ్ట్ సీఈవో సత్య నాదెళ్ల ట్వీట్ చేశారు. భారత ప్రధాని నరేంద్ర మోదీతో తాను దిగిన ఫొటోను సత్యనాదెళ్ల ఈ సందర్భంగా షేర్ చేశారు.

1.58 లక్షల కోట్ల మేరకు...
భారత్ ఆకాంక్షలకు మద్దతుగా మైక్రోసాఫ్ట్ పెట్టుబడులు పెడుతున్నట్లుచెప్పారు. భారత్‌లో ఏఐ అవకాశాలపై ప్రధానితో స్ఫూర్తిదాయక చర్చలు జరిగాయని సత్య నాదెళ్ల చెప్పారు. AI విషయానికి వస్తే, ప్రపంచం భారతదేశంపై ఆశావహంగా ఉందన్నారు. సత్య నాదెళ్లతో చాలా ఫలప్రదమైన సమావేశం జరిగిందని, ఆసియాలోనే అతిపెద్ద పెట్టుబడికి భారత్‌ను ఎంపిక చేయడం ఆనందంగా ఉందని ప్రధాని మోదీ అన్నారు.


Tags:    

Similar News