మందుపాతరలను కనిపెట్టే ఎలుకలు.. ఎంతో ఉపయోగం!!

ఎలుకలు కూడా భద్రతా దళాలకు సహాయం చేస్తాయంటే చాలా మంది నమ్మకపోవచ్చు.

Update: 2025-06-04 12:00 GMT

ఎలుకలు కూడా భద్రతా దళాలకు సహాయం చేస్తాయంటే చాలా మంది నమ్మకపోవచ్చు. ఎందుకంటే కాంబోడియా లాంటి దేశాల్లో మందుపాతరలను కనిపెట్టడానికి ఎలుకల సహాయం తీసుకుంటున్నారు. శిక్షణ పొందిన ‘ఆఫ్రికన్‌ జెయింట్‌ పౌచ్డ్‌ ర్యాట్స్‌’ నే హీరో ర్యాట్స్‌ అని కూడా పిలుస్తారు.


ఆ ఎలుకలు మందుపాతరలను సులువుగా గుర్తిస్తున్నాయి. ఉక్రెయిన్, ఇజ్రాయెల్, ఇంకా అనేక యూరోపియన్‌ దేశాల సైన్యాలు కూడా హీరో ర్యాట్స్‌ దళాన్ని ఏర్పాటు చేసుకున్నాయి. 45 సెంటీమీటర్ల పొడవైన శరీరంతో, దాదాపు అర మీటరు పొడవున్న తోకలు కలిగి ఉండే హీరో ర్యాట్స్‌ సాధారణ ఎలుకల కంటే కాస్త పెద్దవిగా ఉంటాయి. హీరో ర్యాట్స్‌కి ఒక ఏడాది కంటే తక్కువ సమయంలో పూర్తి శిక్షణ ఇస్తారు. ఇవి 6 నుంచి 8 సంవత్సరాలు జీవిస్తాయి.

Tags:    

Similar News