మావోయిస్టుల నిర్ణయం.. ఎత్తుగడలో భాగమేనా? కేంద్ర హోంశాఖలో అనుమానం
మావోయిస్టులు తీసుకున్న నిర్ణయంపై జాతీయ స్థాయిలో చర్చ జరుగుతుంది. ఆయుధాలను వదిలేస్తామని ప్రకటించడం వెనక వ్యూహమేమైనా ఉందా? అన్న చర్చ జరుగుతుంది.
మావోయిస్టులు తీసుకున్న నిర్ణయంపై జాతీయ స్థాయిలో చర్చ జరుగుతుంది. ఆయుధాలను వదిలేస్తామని ప్రకటించడం వెనక వ్యూహమేమైనా ఉందా? అన్న చర్చ జరుగుతుంది. ఎందుకంటే కొన్ని దశాబ్దాలుగా ఉన్న మావోయిస్టు ఉద్యమం అనేక పోరాటాలను కొనసాగించింది. ఆయుధాలతోనే సమస్యలు పరిష్కారమవుతాయని భావించింది. అలాంటి మావోయిస్టులు ఈ రకంగా ఆయుధాలను వదిలేసి సాయుధ పోరాటానికి తాత్కాలికవిరమణ పాటిస్తామని ప్రకటించడం చర్చనీయాంశమైంది. ప్రజా పోరాటాల్లో పాల్గొంటామని ప్రకటించడం కూడా ఎత్తుగడగా హోంశాఖ అభిప్రాయపడుతుంది. ఈ మేరకు మావోయిస్టు పార్టీ అధికార ప్రతినిధి అభయ్ పేరుతో విడుదలయిన ప్రకటన నిజంగానే సంచలనం కలిగించింది.
వందల సంఖ్యలో మావోయిస్టులు...
దండకారణ్యంలో గత కొంతకాలంగా మావోయిస్టుల ఏరివేత కార్యక్రమాన్ని భద్రతాదళాలు చేపట్టాయి. గాలింపు చర్యలు చేపట్టడమే కాకుండా వందల సంఖ్యలో మావోయిస్టులను హతమార్చింది. అనేక మంది కీలక మావోయిస్టు నేతలు మరణించడంతో పాటు అనేక మంది మావోయిస్టులు స్వచ్ఛందంగా లొంగిపోతున్నారు. ఛత్తీస్ ఘడ్, ఒడిశా అటవీ ప్రాంతాల్లో జల్లెడ పడుతున్నారు. మావోయిస్టుల గత కొద్ది నెలల కాలంలో కోల్పోవడంతో పాటు తీవ్ర నష్టం వాటిల్లింది. గాలించి, మరీ ఏరివేయడం ప్రారంభించడం మొదలు పెట్టడంతో మావోయిస్టులో ఆయుధాలను విడిచిపెట్టాలన్న ఆలోచన వచ్చిందా? లేక మరైదైనా విషయమా? అన్న దానిపై కేంద్ర హోం శాఖ అధికారులతో చర్చిస్తుంది.
హోం శాఖ స్పందనపై...
అయితే తాత్కాలిక ఆయుధాలను విరమించి, చర్చల పేరుతో కాలయాపన చేయడాన్ని మావోయిస్టులు తమకు అనుకూలంగా మలచుకుని, ఆ కాలాన్ని తిరిగి బలం పెంచుకునేందుకు, ఆయుధాలను సమకూర్చుకునేందుకు, కొత్త రిక్రూట్ మెంట్ కు ఈ సమాయాన్ని ఉపయోగిస్తాయమోన్న అనుమానం కూడా ఉంది. అయితే మావో్యిస్టులు రాసిన లేఖలో పొందు పర్చిన అంశాలపై ఈమెయిల్, ఫేస్ బుక్ ల ద్వారా తమ అభిప్రాయాలను తెలియజేయాలని ప్రజలను కోరింది. శాంతి చర్చల పేరిట మరొకరకమైన ఎత్తుగడకు దిగాయన్న అనుమానం కలుగుతుంది. ఈ నేపథ్యంలో కేంద్ర హోం శాఖ మావోయిస్టులు రాసిన లేఖపై స్పందించాల్సి ఉంది. మావోయిస్టుల జరమన్న శాంతి చర్చలకు కేంద్ర ప్రభుత్వం అంగీకరిస్తుందా? లేదా? అన్నది మరికొద్ది గంటల్లోనే తేలనుంది