Maoist :మావోయిస్టులకు భారీ ఎదురుదెబ్బ.. కీలన నేత లొంగుబాటు
మావోయిస్టుకు మరోభారీ ఎదురు దెబ్బ తగిలింది. అగ్రనేత అనంత్ పోలీసుల ఎదుట లొంగిపోయారు
మావోయిస్టుకు మరోభారీ ఎదురు దెబ్బ తగిలింది. అగ్రనేత అనంత్ పోలీసుల ఎదుట లొంగిపోయారు. మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఛత్తీస్ గఢ్ జోన్ ప్రతినిదిగా అనంత్ వ్యవహరిస్తున్నారు. అనంత్ అలియాస్ వికాస్ తో పాటు మరో పది మంది మావోయిస్టులు పోలీసుల ఎదుట లొంగిపోయారు. మహారాష్ట్రాలోని గోండియా జిల్లాలోని దారేక్ష పోలీస్ స్టేషన్ లో అనంత్ తో పాటు మిగిలిన మావోయిస్టులు లొంగిపోయారు. అనంత్ పేరిట ఐదు రాష్ట్రాల్లో కలిపి కోటి రూపాయల రివార్డు ఉంది.
పదకొండు మంది...
అనంత్ తో పాటు ఎంఎంసీ ఇన్ ఛార్జి విస్తారో, మూడో ప్లటూన్ కమాండర్ సురేంద్ర కూడా ఉన్నారు. వీరిపై అరవై లక్షల రివార్డు ఉంది. లొంగిపోయిన మావోయిస్టులు పదొకొండు మంది పై మొత్తం రెండు కోట్ల రూపాయల రివార్డు ఉంది. అయితే అనంత్ జనవరి 1వ తేదీ నుంచి ఆయుధాలను విడిచిపోడతామని, అందరం ఒకేసారి లొంగిపోవడం మంచిదన్న అభిప్రాయంతో ఒక లేఖ కూడా విడుదల చేశారు. లేఖ విడుదల చేసిన రోజే ఆయన పదకొండు మందితో కలిసి పోలీసులకు లొంగిపోయారు. ఇది మావోయిస్టులకు ఎదురుదెబ్బ అని చెప్పాలి.