హిడ్మా ఎన్ కౌంటర్ పై మావోయిస్టుల సంచలన లేఖ

హిడ్మా ఎన్ కౌంటర్ పై మావోయిస్టులు లేఖను విడుదల చేశారు

Update: 2025-12-04 07:32 GMT

హిడ్మా ఎన్ కౌంటర్ పై మావోయిస్టులు లేఖను విడుదల చేశారు. హిడ్మాది బూటకపు ఎన్ కౌంటర్ అని అన్నారు. ఈ మేరకు దండకారణ్య స్పెషల్ జోన్ కమిటీ ప్రతినిధి వికల్ప్ పేరుతో మావోయస్టు పార్టీ లేఖ విడుదల చేసింది. హిడ్మాది పూర్తిగా బూటకపు ఎన్ కౌంటర్ అని, అనారోగ్యంతో ఉన్న హిడ్మా, శంకర్ చికిత్స కోసం విజయవాడకు వెళ్లారన్నారు.

కలప వ్యాపారులతో కలసి వెళ్లి...
ఆంధ్రప్రదేశ్ కు చెందిన కలప వ్యాపారులతో కలిసి వెళ్లిన హిడ్మా, శంకర్ లను వారిచ్చిన సమాచారంతోనే పట్టుకున్నారని ఆ లేఖలో పేర్కొన్నారు. కొందరు కలప వ్యాపారులు చేసిన ద్రోహం కారణంగానే వారు దొరికిపోయారని తెలిపారు. వారం రోజుల పాటు నిర్బంధించి చిత్రహింసలకు గురిచేసి హిడ్మాను పోలీసులు చంపేశారని, దీనిపై విచారణ చేయాలని లేఖలో డిమాండ్ చేశారు.


Tags:    

Similar News