Breaking : మావోయిస్టులు కీలక ప్రకటన.. ప్రతీకారం తీర్చుకుంటాం
మావోయిస్టులు కీలక ప్రకటన చేశారు
మావోయిస్టులు కీలక ప్రకటన చేశారు. మావోయిస్టు అగ్రనేతలు దేవ్ జీ, రాజిరెడ్డి తమ వద్దనే ఉన్నారని ఒక ప్రకటనలో తెలిపారు. వికల్ప్ పేరుతో మావోయిస్టులు ఈ లేఖను విడుదల చేశారు. హిడ్మాతో పాటు పదకొండు మందిని పట్టుకుని పోలీసుల కాల్చి చంపారని ఆ లేఖలో తెలిపారు. విజయవాడకు చికిత్స నిమిత్తం హిడ్మా వెళ్లగా కలప, ఫర్నిచర్ వ్యాపారుల కుట్ర వల్లనే చంపారని అన్నారు.
హిడ్మా హత్య విషయంలో...
హిడ్మా హత్య ఏపీ పోలీసులు చేసిన ఆపరేషన్ కాదని ఆ లేఖలో తెలిపారు. మారేడుమిల్లి ఎన్ కౌంటర్ ఒక బూటకమని, తాము అందుకు ప్రతీకారం తీసుకుంటామని ఆ లేఖలో పేర్కొన్నారు. మారేడుమిల్లి ఎన్ కౌంటర్ కు ప్రతీకారం తీర్చుకుంటామని వికల్ప్ లేఖలో తెలిపారు. మావోయిస్టు అగ్రనేతల ఆశయాలను కొనసాగిస్తామని ఆ లేఖలో పేర్కొన్నారు.