Breaking : ఛత్తీస్ గఢ్ - తెలంగాణ సరిహద్దుల్లో భారీ ఎన్ కౌంటర్
మావోయిస్టులకు మరోసారి ఎదురు దెబ్బ తగిలింది. ఛత్తీస్ గఢ్ - తెలంగాణ సరిహద్దుల్లో భారీ ఎన్ కౌంటర్ జరిగింది.
మావోయిస్టులకు మరోసారి ఎదురు దెబ్బ తగిలింది. ఛత్తీస్ గఢ్ - తెలంగాణ సరిహద్దుల్లో భారీ ఎన్ కౌంటర్ జరిగింది. మావోయిస్టులు, భద్రతాదళాలకు మధ్య జరిగిన ఎదురుకాల్పుల్లో మావోయిస్టులు మృతి చెందారు. బీజాపూర్ జిల్లా మరికల్ అడవుల్లో ఈ ఎన్ కౌంటర్ జరిగింది. మావోయిస్టులను ఏరివేసే కార్యక్రమంలో భాగంగా భద్రతాదళాలు అడవి మొత్తాన్ని జల్లెడ పడుతున్నారు.
భారీ సంఖ్యలో...
ఈ నేపథ్యంలో మావోయిస్టులు ఎదురుపడటంతో లొంగిపోవాలని కోరినా, వారు కాల్పులకు దిగారని, అందువల్ల ఎదురు కాల్పులు జరిపినట్లు భద్రతాదళాలు తెలిపాయి. అయితే ఎందరు మావోయిస్టులు మృతి చెందారన్నది ఇంకా అధికారికంగా తెలియకపోయినప్పటికీ భారీ సంఖ్యలోనే మావోయిస్టులు మరణించి ఉంటారని భద్రతాదళాలు అంచనా వేస్తున్నాయి.