శబరిమలలో మకర జ్యోతి దర్శనం

శబరిమలలో మకర జ్యోతి దర్శనమిచ్చింది

Update: 2026-01-14 13:36 GMT

శబరిమలలో మకర జ్యోతి దర్శనమిచ్చింది. రాత్రి 6.30 గంటల సమయంలో మకర జ్యోతి దర్శనం భక్తులకు దర్శనమిచ్చింది. మొత్తం మూడు సార్లు మకర జ్యోతి భక్తులకు కనిపించడంతో అయ్యప్ప భక్తులు ఆనందంతో పులకించి పోయారు. మకరజ్యోతి దర్శనం చేసుకోవడానికి లక్షల సంఖ్యలో భక్తులు శబరిమలకు చేరుకున్నారు.

ఏటా జనవరి 14వ తేదీన...
ప్రతి ఏటా జనవరి 14వ తేదీన మకర జ్యోతి సందర్శనం లభిస్తుంది. ఈ దర్శనం కోసం అయ్యప్పలు నలభై రోజులు దీక్షలో ఉండి వేచి చూస్తుంటారు. అయితే ప్రతి సారీ మకర సంక్రాంతి నాడు జ్యోతి దర్శనం జరుగుతుంది. ఏటా 13, 14, 15 తేదీల్లో సంక్రాంతి పండగ జరుగుతుంది. అయితే ఈసారి 14, 15, 16 తేదీల్లో రావడంతో నేడు శబరిమలలో మకర జ్యోతి దర్శనం కనిపించింది. మకర జ్యోతి దర్శనానికి లక్షల మంది భక్తులు వస్తారని తెలిసిన ట్రావెన్ కోర్ బోర్డు అన్ని రకాల ఏర్పాట్లను చేసింది.


Tags:    

Similar News