పూణెలో ఘోర ప్రమాదం.. పాత వంతెన కూలి ఆరుగురి మృతి

మహారాష్ట్ర పూణెలో ఘోర ప్రమాదం జరిగింది. ఇంద్రాయణి నదిపై వంతెన కూలి పోయి ఆరుగురు మృతి చెందారు

Update: 2025-06-15 11:51 GMT

మహారాష్ట్ర పూణెలో ఘోర ప్రమాదం జరిగింది. ఇంద్రాయణి నదిపై వంతెన కూలి పోయి ఆరుగురు మృతి చెందారు. వంతెన కుప్పకూలడంతో ఆరుగురు మృతి చెందగా, ఇరవై ఐదు మంది గల్లంతయ్యారు. ఆదివారం కావడంతో పెద్ద సంఖ్యలో పర్యాటకులు వచ్చి వంతెనపైకి వచ్చి నదిని చూస్తున్నారు. నిరుపయోగంగా ఉన్న వంతెన వంతెనపై నుంచి సెల్ఫీ దిగేందుకు కొందరు ప్రయత్నించారు. ఈ సమయంలో ఇంద్రాయణి నదిలో వరద నీరు ప్రవహిస్తుంది. దీంతో ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ సిబ్బంది గాలింపు చర్యలు చేపట్టారు. పాత వంతెనపై ఎక్కువ మంది వెళ్లడం వల్లనే ఈ ప్రమాదం జరిగిందని తెలిసింది.

పాత వంతెన పైకి...
పాత వంతెన పైకి ఎవరినీ ఎవరూ అనుమతించరు. ఈ వంతెనకు ప్రత్యామ్నాయంగా మరొక వంతెనను నిర్మించారు. అక్కడ ఆలయాన్ని సందర్శించుకునేందుకు ఎక్కువ సంఖ్యలో టూరిస్టులు వస్తుంటారు. ఇంద్రాయణి నదిపై ఉన్న కుందమాలా పర్యాటక ప్రాంతానికి ఎక్కువ మంది వీకెండ్ లో పర్యాటకులు వస్తుంటారు. గల్లంతయిన వారిలో కొందరిని స్థానికులు రక్షించారని తెలిసింది. ఇంద్రాయణి నదిపై ముప్ఫయి ఏళ్ల క్రితం నిర్మించిన వంతెనను ఇప్పుడు వినియోగించకుండా వదిలేయడం, అక్కడ సెక్యూరిటీ లేకపోవడంతో పర్యాటకులు దానిపైకి ఎక్కడంతో అది ఒక్కసారిగా కూలిపోయింది.
భారీ వర్షాలకు వరద నీరు...
రెండు రోజులుగా కురుస్తునన భారీ వర్షాలకు ఇంద్రాయణి నదిలో వరద నీరు ఎక్కువగా ఉండటంతో వంతెన మీద పడి నుంచి వారుకొట్టుకు పోయారు. ప్రస్తుతం వారి కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. కనీసం వీకెండ్ లో అయినా ఇటువంటి పాత కాలం వంతెనల వద్ద సైన్ బోర్డులుఏర్పాటు చేయాలని, వంతెనపైన ఎక్కడం ప్రమాదకరమని, అలాగే పోలీసులను కూడా ఉంచితే ఈ పరిస్థితి తలెత్తేది కాదని అంటున్నారు. పర్యాటకులు ఎక్కువగా వచ్చే వీకెండ్ లో అయినా ఇలాంటి ఏర్పాటు చేయాల్సిందని, లేకుంటే వంతెనను ప్రభుత్వమే కూల్చివేసిఉంటే ఇంతదారుణం జరిగి ఉండేది కాదని అంటున్నారుజ
















Tags:    

Similar News