Breaking : టీవీకే అధినేత విజయ్ కు షాకిచ్చిన మద్రాస్ హైకోర్టు
కరూర్ తొక్కిసలాట ఘటనను సీబీఐకి అప్పగించాలన్న టీవీకే పిటీషన్ ను మద్రాస్ హైకోర్టు తిరస్కరించింది.
కరూర్ తొక్కిసలాట ఘటనను సీబీఐకి అప్పగించాలన్న టీవీకే పిటీషన్ ను మద్రాస్ హైకోర్టు తిరస్కరించింది. తొలుత రాష్ట్ర పోలీసులు దర్యాప్తు చేయాలని, ఆ దర్యాప్తుపై అసంతృప్తి ఉంటే అప్పుడు సీబీఐ విచారణకు అడగాలని కోరింది. సీబీఐ విచారణకు మద్రాస్ హైకోర్టు నిరాకరించింది. విచారణ ప్రారంభ దశలోనే సీబీఐకి బదిలీ చేయాలంటే ఎలా అని మద్రాస్ హైకోర్టు ప్రశ్నించింది. పార్టీ కార్యక్రమంలో తాగు నీటి సౌకర్యాన్ని ఎందుకు కల్పించలేదని న్యాయస్థానం ప్రశ్నించింది.
సీబీఐ దర్యాప్తునకు...
న్యాయస్థానాలను రాజకీయ వేదికగా మార్చుకోవద్దని కూడా సూచించింది. రోడ్డుపై సభకు ఎందుకు అనుమతించారని పోలీసులను ప్రశ్నించింది. టీవీకే అధినేత విజయ్ కరూర్ సభలో తొక్కిసలాట జరిగి 41 మంది మరణించిన ఘటనలో తొలుత ప్రాధమిక దర్యాప్తు పూర్తి కావాలని, దానిపై అసంతృప్తి ఉంటే అప్పుడు సీబీఐ విచారణకు కోరాలని న్యాయస్థానం ఆదేశించింది. మూడు వారాల్లో జరిగిన ఘటనపై తమకు నివేదిక ఇవ్వాలని ప్రభుత్వాన్ని మద్రాస్ హైకోర్టు ఆదేశించింది