ISRO : నింగిలోకి LVM3-M6 బహుబలి రాకెట్

శ్రీహరి కోట నుంచి LVM3-M6 బహుబలి రాకెట్ ప్రయోగం జరిగింది

Update: 2025-12-24 03:42 GMT

శ్రీహరి కోట నుంచి LVM3-M6 బహుబలి రాకెట్ ప్రయోగం జరిగింది. LVM3-M6 రాకెట్ ద్వారా అమెరికాకు చెందిన బ్లూ బర్డ్-2 ప్రయోగాన్ని నిర్వహించారు.ఉదయం 8:55 గంటలకు LVM3-M6 రాకెట్ ప్రయోగాన్ని ఇస్రో శాస్త్రవేత్తలు పర్యవేక్షించారు. అత్యంత బరువైన ఉప గ్రహాన్ని ఇస్రో శాస్త్రవేత్తలు నింగిలోకి పంపడానికి నిన్నటి నుంచి కౌంట్ డౌన్ ప్రారంభమయింది.

అమెరికాకు చెందిన...
అమెరికాకు చెందిన బ్లూబర్డ్ ఉపగ్రహాన్ని ఇస్రో పంపింది. తొలిసారిగా భారీ ఉపగ్రహాన్ని నింగిలోకి పంపనున్న ఇస్రో సరికొత్త రికార్డును సృష్టించింది. ఈ ఉప గ్రహం బరువు 6,100 కిలోలు. హై స్పీడ్ సెల్యులార్, బ్రాండ్ బాండ్ సేవలను అందించనున్న ఉపగ్రహాన్ని ఇస్రో నింగిలోకి పంపింది. సెల్ టవర్లు లేని చోట శాటిలైట్ ద్వారా సేవలను అందించే వీలుంది. 100వ ప్రయోగంతో వాణిజ్య ప్రయోగాన్ని ఇస్రో శాస్త్రవేత్తలు చేశారు. అమెరికాతో పాటు మరికొన్ని దేశాలకు ఈ ఉపగ్రహం ద్వారా సేవలు అందనున్నాయి.


Tags:    

Similar News