అదృష్టమంటే ఇదే వారంలో 8 వజ్రాలు

జీవితంలో ఒక్క వజ్రం దొరికితే చాలని అనుకునే వాళ్లు ఎంతో మంది ఉన్నారు. అలాంటిది ఏకంగా 8 వజ్రాలు దొరకడమంటే..

Update: 2025-09-20 14:30 GMT

Bargadi Khurd, diamonds, Panna

జీవితంలో ఒక్క వజ్రం దొరికితే చాలని అనుకునే వాళ్లు ఎంతో మంది ఉన్నారు. అలాంటిది ఏకంగా 8 వజ్రాలు దొరకడమంటే.. అది కూడా వారం రోజుల్లోనే!! రచనా గోల్దర్‌ అనే బెంగాలీ మహిళకు లక్కు ఊహించని విధంగా కలిసొచ్చింది. రత్నాల నగరంగా పేర్కొందిన పన్నాకు 25 కిలోమీటర్ల దూరంలోని బర్గాది ఖుర్ద్‌ గ్రామంలో రచనా గోల్దర్, ఆమె భర్త రాధామోహన్‌ గోల్దర్‌కు సొంత భూమి ఉంది. రాధామోహన్‌ తన భార్య పేరుతో ఆ భూమిలో వజ్రాల అన్వేషణ అనుమతులు పొంది తవ్వకాలు ప్రారంభించారు. వారం రోజుల వ్యవధిలో వరుసగా 8 వజ్రాలు లభించగా ఆ దంపతులు పన్నా వజ్రాల కార్యాలయంలో అప్పగించారు. వీటిలో ఆరు నాణ్యమైనవి కాగా, రెండు సాధారణ వజ్రాలని అధికారులు నిర్ధారించారు. త్వరలో వేలంలో విక్రయించి ఆ మొత్తాన్ని రచనా గోల్దర్‌కు అందజేయనున్నారు అధికారులు.

Tags:    

Similar News