18 రోజుల్లో తల్లీ, తండ్రిని కోల్పోయి.. అనాథలై
అర్జున్ పటోలియా అనే వ్యక్తి మరణించడం ఓ కుటుంబాన్ని చిదిమేసింది. ఇద్దరు అమ్మాయిలను అనాథలను చేసింది.
అర్జున్ పటోలియా అనే వ్యక్తి మరణించడం ఓ కుటుంబాన్ని చిదిమేసింది. ఇద్దరు అమ్మాయిలను అనాథలను చేసింది. అర్జున్ భార్య భారతి కొన్ని రోజుల క్రితం మరణించారు. తన అస్థికలను గుజరాత్‌లోని అమ్రేలి జిల్లా వాడియా గ్రామంలో ఉన్న తమ పూర్వీకుల చెరువులో నిమజ్జనం చేయాలన్నది ఆమె చివరి కోరిక.
భార్య కోరికను తీర్చడానికి అర్జున్ భారత్‌కు వచ్చారు. వాడియా గ్రామంలో భారతికి సంతాప సభ కూడా నిర్వహించారు. అంత్యక్రియల కార్యక్రమాలు పూర్తి చేసుకుని, లండన్‌లో ఉన్న తన ఇద్దరు కుమార్తెల వద్దకు తిరుగు ప్రయాణమయ్యారు. ఇంతలోనే ప్రమాదంలో మృతి చెందారు. 18 రోజుల వ్యవధిలో 8, 4 సంవత్సరాల వయసున్న ఆ చిన్నారులు తల్లిదండ్రులను కోల్పోయి అనాథలయ్యారు.