Loksabha : నేడు ఆపరేషన్ సింధూర్ పై చర్చ
నేడు ఆపరేషన్ సింధూర్ పై లోక్ సభలో చర్చ జరగనుంది
నేడు ఆపరేషన్ సింధూర్ పై లోక్ సభలో చర్చ జరగనుంది. ఇప్పటికే అన్ని పార్టీల సభ్యులకు ఆ యా పార్టీలు విప్ లు జారీ చేశాయి. ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా సమావేశాలకు హాజరు కావాలని విప్ జారీ చేశాయి. ఆపరేషన్ సింధూర్, పహాల్గామ్ లో ఉగ్రవాదుల దాడి, కాల్పుల విరమణ అంశంపై దాదాపు పదహారు గంటల పాటు చర్చ జరిగే అవకాశముంది. ఈ మేరకు అధికార పార్టీ ఆపరేషన్ సింధూర్ పై చర్చకు సిద్ధమయింది. రాజ్యసభలో తొమ్మది గంటల పాటు ఆపరేషన్ సింధూర్ పై చర్చ జరగనుంది.
అధికార, విపక్ష సభ్యులు...
ఇప్పటికే ఇండి కూటమి నేతలు కూడా ఈ అంశంపై ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టేందుకు సిద్ధమయ్యారు. ఆపరేషన్ సింధూర్ లో భారత్ కు కలిగిన నష్టంతో పాటు కాల్పుల విరమణపై ట్రంప్ చేసిన వ్యాఖ్యలపై ప్రభుత్వాన్ని నిలదీయడానికి విపక్షాలు రెడీ అయ్యాయి. అధికార పక్షం కూడా అస్త్రశస్త్రాలతో సిద్ధమవుతుంది. విపక్షాల విమర్శలకు దీటుగా సమాధానం చెప్పేందుకు తగిన వ్యూహాన్ని రచించుకున్నారు. మొత్తం మీద నేడు జరిగే ఆపరేషన్ సింధూర్ పై చర్చ వాడి వేడిగా పార్లమెంటులో జరగనుంది.