Loksabha : లోక్ సభ పన్నెండు గంటలకు వాయిదా

లోక్ సభ వాయిదా పడింది. ఈరోజు ఉదయం సభ ప్రారంభమయిన వెంటనే విపక్షాలు బీహార్ లో ఓటర్ల జాబితా సవరణపై చర్చకు పట్టుబట్టాయి

Update: 2025-07-28 05:50 GMT

లోక్ సభ వాయిదా పడింది. ఈరోజు ఉదయం సభ ప్రారంభమయిన వెంటనే విపక్షాలు బీహార్ లో ఓటర్ల జాబితా సవరణపై చర్చకు పట్టుబట్టాయి. ప్రశ్నోత్తరాలు జరుగుతున్నప్పటికీ విపక్షాలు ఈ అంశంపైనే చర్చ జరగాలని స్పీకర్ పోడియంను చుట్టుముట్టాయి. స్పీకర్ ఓం బిర్లా పలుమార్లు సభ్యులను హెచ్చరించినా ఫలితం లేకపోవడంతో సభను పన్నెండు గంటలకు వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు.

సభ ప్రారంభమయిన వెంటనే...
సభ ప్రారంభమయిన వెంటనే ఇండి కూటమి సభ్యలందరూ బీహార్ ఓటర్ల జాబితా సవరణపైనే చర్చించాలని, ప్రశ్నోత్తరాలను, జీరో అవర్ ను పక్కన పెట్టి చర్చించాలని పట్టుబట్టాయి. తాము ఇచ్చిన వాయిదా తీర్మానంపై చర్చ జరగాలని కోరాయి. అయితే స్పీకర్ అందుకు అంగీకరించలేదు. దీంతో ఆందోళనకు దిగడం, సభలో గందరగోళ పరిస్థితులు నెలకొనడంతో పన్నెండు గంటలకు సభను స్పీకర్ వాయిదా వేశారు.


Tags:    

Similar News