Ayodhya : రోజుకు గంట సేపు అయోధ్య ఆలయం మూసివేత

అయోధ్యలో భక్తుల సంఖ్య అధికంగా వస్తున్నారు. రోజుకు లక్షల సంఖ్యలో భక్తులు అయోధ్యకు చేరుకుంటున్నారు

Update: 2024-02-17 03:53 GMT

అయోధ్యలో భక్తుల సంఖ్య అధికంగా వస్తున్నారు. రోజుకు లక్షల సంఖ్యలో భక్తులు అయోధ్యకు చేరుకుంటున్నారు. భక్తుల సంఖ్య పెరగడంతో దర్శన వేళలను కూడా గతంలో పెంచిన శ్రీరామజన్మభూమ తీర్థ్ ట్రస్ట్ మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఆలయ వేళల్లో మార్పులు చేయాలని నిర్ణయించింది. దేశం నుంచే కాకుండా ఇతర దేశాల నుంచి కూడా భక్తులు వస్తుండటంతో ఆలయం వేళలు అధికంగా మారినట్లు గుర్తించింది.

బ్రేక్ ఇవ్వాలని...
దీంతో రోజుకు గంట సేపు దర్శనానికి బ్రేక్ ఇవ్వాలని శ్రీరామజన్మభూమ తీర్థ్ ట్రస్ట్ డిసైడ్ చేసింది. ఈ మేరకు ఆలయ పూజారి ఆచార్య సత్యేంద్ర దాస్ వెల్లడించారు. ఇకపై బాలరాముడికి విశ్రాంతి కల్పించాాలని నిర్ణయించామని, రోజూ మధ్యాహ్నం మ12.30 గంటల నుంచి 1.30 గంటలకు ఆలయ ద్వారాలు మూసివేయాలని నిర్ణయించినట్లు ఆయన తెలిపారు.


Tags:    

Similar News