అక్టోబర్ 1 నుంచి కొత్త నిబంధనలివే
అక్టోబర్ 1 నుంచి కీలక నిబంధనలు అమలులోకి రానున్నాయి. ఎన్పీఎస్, ఆధార్, యూపీఐ విధానంలో మార్పులు రానున్నాయి
అక్టోబర్ 1 నుంచి కీలక నిబంధనలు అమలులోకి రానున్నాయి. ఎన్పీఎస్, ఆధార్, యూపీఐ విధానంలో మార్పులు రానున్నాయి. జాతీయ పెన్షన్ పథకం , ఆధార్ అప్ డేట్స్, ఆన్ లైన్ గేమింగ్, యూపీఐ వంటి అనేక రంగాలలో అక్టోబర్ 1వ తేదీ నుంచి కీలక నిబంధనలు మారనున్నాయి. జాతీయ పింఛను పథకంలో పెట్టుబడిదారులు ఒకే పాన్ నంబర్లో బహుళ పథకాలలో పెట్టుబడి పెట్టేందుకు అవకాశం కల్పిస్తూ నిర్ణయం తీసుకుంది.
ఐఆర్టీసీ టికెట్ బుకింగ్ ...
ఐఆర్టీసీ టికెట్ బుకింగ్ మొదటి పదిహేనునిమిషాలు ఆధార్-లింక్డ్ ఖాతాలకు మాత్రమే అందుబాటులో ఉండనుంది. యూపీఎ 'కలెక్ట్ రిక్వెస్ట్' ఫీచర్ నిలిపివేయనున్నట్లు తెలిపింది. అలాగే, ఆధార్ సేవలకు రుసుములు పెరగనున్నాయని ప్రకటించింది. ఆన్ లైసన్ గేమింగ్ నూ కొత్త నిబంధనలు అమలులోకి వస్తాయని పేర్కొంది. అక్టోబరు 1వ తేదీ నుంచి ఈ కొత్త నిబంధనలు అమలులోకి రానున్నాయి.