జార్ఖంఢ్ లో జరిగిన భారీ ఎన్ కౌంటర్ ... మావోయిస్టు కీలక నేత మృతి
జార్ఖంఢ్ లో జరిగిన భారీ ఎన్ కౌంటర్ లో మావోయిస్టు కీలక నేత మరణించారు.
జార్ఖంఢ్ లో జరిగిన భారీ ఎన్ కౌంటర్ లో మావోయిస్టు కీలక నేత మరణించారు. జార్ఖండ్ లోని హజారీ బాగ్ అటవీ ప్రాంతంలో భద్రత బలగాలకు, మావోయిస్టులకు మధ్య జరిగిన ఎదురుకాల్పుల్లో మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు సహదేవ్ సోరెన్ మరణించారు. ఆయనతో పాటు మరో ఇద్దరు మావోయిస్టులు కూడా మరణించినట్లు భద్రతాదళాలు తెలిపాయి.
భారీగా ఆయుధాలను...
మృతి చెందిన మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు సహదేవ్ పై కోటి రూపాయల రివార్డు కూడా ఉంది. ఎన్ కౌంటర్ జరిగిన ప్రాంతం నుంచి భద్రతాదళాలు పెద్దసంఖ్యలో మారణాయుధాలు, విప్లవ సాహిత్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఇంకా ఆ ప్రాంతంలో మావోయిస్టుల కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయని అధికారులు తెలిపారు.