లొంగిపోయిన మరో మావోయిస్టు కీలక నేత రామ్ ధీర్
మావోయిస్టులకు మరో ఎదురుదెబ్బ తగిలింది. మావోయిస్టు కీలక నేత రామ్ ధీర్ లొంగిపోయారు
మావోయిస్టులకు మరో ఎదురుదెబ్బ తగిలింది. మావోయిస్టు కీలక నేత రామ్ ధీర్ లొంగిపోయారు. ఛత్తీస్ గఢ్ ముఖ్యమంత్రి విష్ణు దేవ్ సాయి ఎదుట మావోయిస్టులు లొంగిపోయారు. రామ్ ధీర్ మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యుడిగా కొనసాగుతున్నారు. ఆయనపై కోటి రూపాయల రివార్డు ఉంది. రామ్ ధీర్ తో పాటు పన్నెండు మంది మావోయిస్టులు లొంగిపోయారు.
కోటి రూపాయల రివార్డు...
లొంగిపోయిన వారిలో ఆరుగురు మహిళలున్నారు. ఇటీవల మావోయిస్టులు వరసగా లొంగిపోతున్నారు. ఛత్తీస్ గఢ్, ఒడిశా, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ లో జరిగిన వరస ఎన్ కౌంటర్లతో పాటు ఆపరేషన్ కగార్ నేపథ్యంలో వందల సంఖ్యలో మావోయిస్టులు లొంగిపోతున్నారు. ప్రభుత్వం పిలుపులో భాగంగా మావోయిస్టులు వరసగా లొంగిపోతున్నారు.