Sabarimala : శబరిమల వెళ్లే భక్తులకు అలెర్ట్.. అక్కడకు వెళ్లొద్దు

అయ్యప్ప దర్శనానికి శబరిమల వెళ్లే భక్తులకు కేరళ ప్రభుత్వం స్పష్టమైన సూచనలు చేసింది

Update: 2025-12-09 12:23 GMT

అయ్యప్ప దర్శనానికి శబరిమల వెళ్లే భక్తులకు కేరళ ప్రభుత్వం స్పష్టమైన సూచనలు చేసింది. శబరిమలకు వచ్చిన వారు ఆ ప్రాంతానికి మాత్రం వెళ్లొద్దని తెలిపింది. ప్రస్తుతం మండల దీక్షలు కొనసాగుతుండటంతో పాటు జనవరి నెలలో జ్యోతి వరకూ అయ్యప్పస్వాములు లక్షల సంఖ్యలో శబరిమలకు వస్తారు. అయితే శబరిమలకు వచ్చి స్వామిని దర్శించుకున్న తర్వాత కేరళలోని ముఖ్యమైన ప్రదేశాలకు వెళతారు.

ప్రమాదకరమైన పరిస్థితులున్నాయంటూ...
అయితే అయ్యప్ప భక్తులతో పాటు కేరళకు వచ్చే పర్యాటకులు శబరిమల సమీపంలో ఉన్న ఉరుక్కుళి జలపాతాన్ని సందర్శించ వద్దని కేరళ ప్రభుత్వం కోరింది. అక్కడ తరచూ ప్రమాదాలు జరుగుతన్నాయని తెలిపింది. అంతేకాకుండా అక్కడ క్రూర మృగాల బారిన పడే అవకాశముందని కూడా కేరళ అటవీ శాఖ అధికారులు హెచ్చరించారు. శబరిమలకు వెళ్లే భక్తులు ఎవరూ ఉరక్కుళి జలాపాతాన్ని సందర్శించవద్దని కోరుతున్నాను.


Tags:    

Similar News