మంచుతుఫాను : చిక్కుకున్న యాత్రికులు

కేదార్‌నాథ్ యాత్రను తాత్కాలికంగా నిలపివేశారు. మంచులో కూరుకుపోయిన యాత్రికులను రక్షించారు

Update: 2023-05-03 04:42 GMT

కేదార్‌నాధ్ యాత్ర నిలిచిపోయింది. భారీగా మంచుకురుస్తుండటంతో కేదార్‌నాథ్ యాత్రను తాత్కాలికంగా నిలపివేశారు. మంచులో కూరుకుపోయిన యాత్రికులను రక్షించారు. చార్‌థామ్ యాత్రకు వెళ్లి మంచు తుపానుకు చిక్కుకుని అందులో చిక్కుకుని పోయారు.

కాపాడిన...
అయితే వెంటనే కొందరు యాత్రికులు వారిని రక్షించారు. యాత్రికులు అప్రమత్తంగా ఉండాలని, కేదార్‌నాధ్ యాత్రను తాత్కాలికంగా నిలిపేశారని, ఇటు వైపు రావద్దని హెచ్చరికలు జారీ చేస్తున్నారు. వస్తే మంచు తుపానులో చిక్కుకునే ప్రమాదం ఉందని వార్నింగ్ ఇస్తున్నారు. మంచు చరియలు కూడా విరిగిపడుతుండటంతో యాత్రికులు అవస్థలు పడుతున్నారు. ప్రభుత్వం మాత్రం యాత్రను తాత్కాలికంగా నిలిపివేసింది.


Tags:    

Similar News