బెంగళూరు ఘటనపై కర్ణాటక సర్కార్ సీరియస్

బెంగళూరులో జరిగిన తొక్కిసలాట ఘటనపై కర్ణాటక ప్రభుత్వం సీరియస్ అయింది.

Update: 2025-06-06 03:22 GMT

బెంగళూరులో జరిగిన తొక్కిసలాట ఘటనపై కర్ణాటక ప్రభుత్వం సీరియస్ అయింది. అధికారులపై చర్యలకు దిగింది. పోలీసు అధికారులను సస్పెన్షన్ చేస్తూ నిర్ణయం తీసుకుంది. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు పంజాబ్ కింగ్స్ పై ఐపీఎల్ ఫైనల్స్ లో విజయం సాధించడంతో బెంగళూరుకు రాయల్ ఛాలెంజర్స్ టీం వచ్చిన నేపథ్యంలో చిన్న స్వామి స్టేడియం వద్ద తొక్కిసలాట జరిగింది.

పోలీసు అధికారుల సస్పెన్షన్...
ఈ తొక్కిసలాటలో పదకొండు మంది అభిమానులు మరణించారు. దీనిపై సర్వత్రా విమర్శలు ఎదురు కావడంతో పోలీసు అధికారులపై చర్యలు తీసుకుంది. బెంగళూరు తొక్కిసలాట ఘటనలో బెంగళూరు పోలీస్ కమిషన్ దయానంద్ తో సహా డీసీపీ శేఖర్, ఏసీపీలు వికాస్ కుమార్, బాలకృష్ణ, ఇన్స్పెక్టర్ గిరీష్‌ను కర్ణాటక ప్రభుత్వం సస్పెండ్ చేసింది, దీనిపై రిటైర్డ్ న్యాయమూర్తితో విచారణకు ఆదేశించింది. ముప్ఫయి రోజుల్లో ఘటనకు సంబంధించిన నివేదికను సమర్పించాలని ఆదేశించింది.


Tags:    

Similar News