కాంగ్రెస్ ఎమ్మెల్యే అరెస్ట్.. పన్నెండు కోట్లు స్వాధీనం

కర్ణాటక కాంగ్రెస్ ఎమ్మెల్యే కేసీ వీరేంద్రను ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ అధికారులు అరెస్ట్ చేశారు.

Update: 2025-08-23 11:28 GMT

కర్ణాటక కాంగ్రెస్ ఎమ్మెల్యే కేసీ వీరేంద్రను ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ అధికారులు అరెస్ట్ చేశారు. మనీ లాండరింగ్ కేసులో ఎమ్మెల్యే వీరేంద్రను అరెస్ట్ చేసినట్లు ఈడీ అధికారులు వెల్లడించారు. నిన్నటి నుంచి ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ అధికారులు ఏకకాలంలో అనేక ప్రదేశాల్లో దాడులు చేసి పన్నెండు కోట్ల రూపాయలను స్వాధీనం చేసుకున్నారు.

మనీలాండరింగ్ కేసులో ...
మనీలాండరింగ్ కేసులో కేసీ వీరేంద్రను అరెస్ట్ చేసినట్లు ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ అధికారులు ప్రకటించారు. పన్నెండుకోట్ల రూపాయలకు పైగా నగదుతో పాటు బంగారం, వెండి ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు. దీంతో పాటు కోటి కంటే ఎక్కువ మొత్తంలో విదేశీ కరెన్సీని కూడా సీజ్ చేశారు. దేశ వ్యాప్తంగా ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ అధికారులు రెండు రోజుల పాటు జరిగిన దాడుల్లో కాంగ్రెస్ పార్టీకి చెందిన చిత్రదుర్గ ఎమ్మెల్యే కేసీ వీరేంద్ర ను అరెస్ట్ చేసినట్లు ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ అధికారులు ప్రకటించారు.


Tags:    

Similar News